Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
Kharjur Laddu: ఖర్జూరా పొడి లడ్డూ
ఖర్జూరా ఎన్నో పోషకాలు కలిగిన ఆహార పదార్థం. ఖర్జూరాల్లో గ్లూకోజ్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాల ఉన్నప్పటికీ వాటిని తినడం చాలా మందికి ఇష్టం ఉండదు.
Kharjur Laddu: ఖర్జూరా ఎన్నో పోషకాలు కలిగిన ఆహార పదార్థం. ఖర్జూరాల్లో గ్లూకోజ్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాల ఉన్నప్పటికీ వాటిని తినడం చాలా మందికి ఇష్టం ఉండదు.

అలాంటి వారు ఖర్జూరా లడ్డులు చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతం అవుతుంది.

ఖర్జూరా లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు:
* ఖర్జూరాలు - 1 కప్పు (100 గ్రాములు)
* ఎండు కొబ్బరి - 1/2 కప్పు
* నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
* బాదం - 2 టేబుల్ స్పూన్లు
* జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
* యాలకులు - 4

ఖర్జూరా తయారీ విధానం:
* ఖర్జూరాలను కడిగి, నీరు ఆరిపోయే వరకు ఎండబెట్టి, గింజలు తొలగించి ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
* అలాగే జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
* కొబ్బరి ముక్కలను మిక్సీ జార్‌లో వేసి పొడి చేసుకోవాలి. బాదం పప్పులను గ్రైండ్ చేసుకోవాలి. ఖర్జూరా ముక్కలను మిక్సీ జార్‌లో వేసి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి,
* యాలకుల పొట్టు తీసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
* గిన్నె తీసుకుని అందులో నెయ్యి పోసుకుని వేడి చేసుకోవాలి.
* గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఖర్జూరం పేస్టు అందులో వేసి నీరు ఆవిరి అయిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి.
* తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గిన్నె తీసి పక్కన పెట్టుకుని
అందులో కొబ్బరి పొడి, జీడిపప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి, బాదం పొడి అన్నీ చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి.
* ఆ మిశ్రమం కొద్దిగా చల్లగా అయ్యాక చేతులకు నెయ్యి రాసుకుని రెండు చేతులతో చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి.
ఖర్జూరా లడ్డూ సిద్ధం అయినట్లే. వీటిని నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications