Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
మలై లడ్డు: దివాళి స్పెషల్
పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే దసరా, దీపావళి వస్తున్నాయంటే లడ్డూల తయారీకి సమయం ఆసన్నమైందనే అర్థం. లడ్డూ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అందుకే ఈ దీపావళికి మీకోసం..
దీపావళి వచ్చేసింది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో..ఇంటినిండా బందువులు, స్నేహితులతో చాలా ఆడంభరంగా జరుపుకొనే దీపావళి. హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు.
ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇంట్లోను రంగవల్లులు, పిండివంటలు, కొత్తబట్టలు, బందువులు, స్నేహితులు కిటకిటలాడుతుంటుంది. లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది. ఈ దీపావళికీ అథితులకు, కుటుంబ సభ్యలకు అత్యంత ఇష్టమైన రకరకాల స్వీట్స్ తయారుచేసుకుంటారు. వాటిలో లడ్డులు స్పెషల్. లక్ష్మీ దేవిని నైవేద్యం పెట్టాలన్నా, అతిథులను ఆనంద పరచాలన్నా దీపావళి రోజు ఇంట్లో లడ్డులు చేయాల్సిందే.
పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే దసరా, దీపావళి వస్తున్నాయంటే లడ్డూల తయారీకి సమయం ఆసన్నమైందనే అర్థం. లడ్డూ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అందుకే ఈ దీపావళికి మీకోసం.. 'లడ్డూ స్పెషల్'.

మైదాపిండి: 1/2kg
నెయ్యి: 400grm
పంచదార పొడి: 1kg
జీడిపప్పు: 1/4kg
హార్లిక్స్: 200grm
అమూల్ స్ప్రే: 800grm
జాజికాయ, జాపత్రి: 5grm
యాలకుల పొడి: 10grms
కిస్‌మిస్: 50grms
పిస్తాపప్పు: 100
బాదంపప్పు: 100grms
తయారుచేసే విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో మైదాపిండి వేసి సన్నటి మంటపై వేయించాలి. మైదా వేగిందో లేదో తెలియాలంటే ఒక నీటి చుక్క మైదాపిండిపై వేయాలి. అది పొంగితే మైదాపిండి వేగిందని అర్థం. ఇలా వేగిన మైదాను ఒక గిన్నెలోకి తీసి చల్లార్చాలి.
2. తర్వాత పూర్తిగా చల్లారాక అందులో అమూల్ స్ప్రే, హార్లిక్స్, పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఒకవేళ పిండి బాగా మెత్తగా ఉంటే పంచదార పొడి మరికొంత వేసుకోవచ్చు.
3. తర్వాత జీడిపప్పు, పిస్తాపప్పు, బాదంపప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసి నేతిలో వేయించి ఈ పిండిలో వేయాలి. కిస్‌మిస్, యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి కూడా చేర్చి నెమ్మదిగా కలపాలి.
4. ఇలా తయారైన లడ్డు పిండి కాసేపు ఆరాక అరచేతికి నెయ్యిగాని నూనెగాని రాసుకుని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే మలై లడ్డు రెడీ..



Click it and Unblock the Notifications











