Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నవరాత్రి స్పెషల్-జిలేబీ తయారీ విధానం(స్పెషల్ వీడియో)
నవరాత్రి స్పెషల్-జిలేబీ తయారీ విధానం(వీడియో)
మనలో చాలా మందికి జిలేబీలు ఇష్టమైన స్వీటు.త్వరగా తయారయ్యే నోరూరించే ఈ స్వీటు ఎవరికి ఇష్టముండదు చెప్పండి?? ఇదే కాకుండా ఈ స్వీటు ఇప్పుడు ఎందుకు తయారు చేసుకోవాలో మేము ఒక కారణం చెప్తాము. ఎందుకంటే రాబోయేది నవరాత్రుల సమయం కాబట్టి.అందుకే ఈ స్వీటు తప్పక చెయ్యాలి మరి.
నవరాత్రులు త్వరలోనే వస్తున్నాయి కదా.తొమ్మిది రోజుల పాటు జరుపుకునే నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కో దుర్గా మాత అవతారాన్ని పూజిస్తూ ప్రతీరోజూ ఒక్కో రకం స్వీటు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.అలాంటి ప్రసాదాల్లో చూడగానే నోరూరించే జిలేబీ కూడా ఒకటి.మరింక ఆలశ్యమెందుకు, జిలేబీ తయారీ విధానమెలాగో క్రింద ఇచ్చిన వీడియో చూసి తెలుసుకోండి.
ఎంత మందికి సరిపోతుంది-5
జిలేబీ తయారీ సమయం-20 నిమిషాలు
సామాన్లు సిద్ధం చేసుకోవడం-30 నిమిషాలు
కావాల్సిన పదార్ధాలు:
1.రీఫైండ్ ఫ్లోర్(మైదా)-ఒక కప్పు
2.పెరుగు-అరకప్పు
3.ఆరెంజ్ ఫుడ్ కలర్-పావు టీ స్పూన్
4.పంచదార-ఒక కప్పు
5.నీళ్ళు-ఒక కప్పు
6.కుంకుమ పూవు రెకలు-5-6
7.గార్నిషింగ్-రబ్రీ స్వీట్ మరియూ పిస్తా పప్పులు.
తయారు చేసే విధానం:

1.ఒక పెద్ద గిన్నెలో మైదా(రిఫైండ్ ఫ్లోర్),పెరుగు,ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి తగినంత నీరు పోసి పల్చగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఒక వెచ్చటి స్థలంలో 8-9 గంటలపాటు ఉంచి పులియబెట్టాలి.

2.పంచదార,కుంకుమ పువ్వుని నీటిలో కలిపి సన్నని సెగ మీద పాకం వచ్చేవరకూ ఉంచాలి.తరువాత కొద్దిగా మంట పెంచి పాకాన్ని కాస్త దగ్గరకి రానివ్వాలి.

3.జిలేబీ వెయ్యడానికి సిద్ధం చేసుకున్న వస్త్రం మీద జిలేబీ పిండి వేసి నాలుగు పక్కలూ మడిచి పొట్లం లాగ చెయ్యాలి.

4.వేడి వేడి నెయ్యి లేదా నూనెలో చక్రాల్లాగా జిలేబీని వేసి మధ్య మధ్యలో కదుపుతూ గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి.

5.నూనెలో నుండి తీసి పంచదార పాకంలో వేసి 2-3 నిమిషాలుంచి తీసెయ్యాలి.పాకం నుండీ తీసిన జిలేబీలు ఒక పళ్ళెంలో తీసుకుని వాటి మీద రబ్రీ స్వీట్ కాస్త వేసి పిస్తా పప్పులతో అలంకరించుకోవాలి.




Click it and Unblock the Notifications