Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే అరటిపండు మాల్పువా.. ఈ సీక్రెట్ తో చేస్తే రుచి అద్భుతం!
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే మాల్పువా రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా బయట దొరికే మాల్పువాలను మావా (ఖోవా)తో చేస్తారు. కానీ, మనం మావా లేదా బేకింగ్ సోడా లాంటివి ఏమీ వాడకుండానే, కేవలం బాగా పండిన అరటిపండ్లను ఉపయోగించి అత్యంత మృదువైన, నోరూరించే మాల్పువాలను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పండిన అరటిపండు కలపడం వల్ల మాల్పువాలకు అద్భుతమైన మృదుత్వం వస్తుంది.

పిండిని కలుపుకునే విధానం
ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి (లేదా మైదా) వేయండి. దానికి అర కప్పు కంటే కొంచెం తక్కువగా బొంబాయి రవ్వ (సూజీ) కలపండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో బాగా పండిన ఒక అరటిపండును ముక్కలుగా కోసి వేయండి. దానికి ఒక కప్పు పాలను జతచేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ అరటిపండు-పాల మిశ్రమాన్ని రెడీ చేసుకున్న పిండిలో పోసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చిక్కటి దోశ పిండి లాగా కలుపుకోవాలి.
పిండిని నానబెట్టడం, పాకం తయారీ
కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు పక్కన
పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ బాగా నాని, పిండి ఉబ్బి మాల్పువాలు
అత్యంత మృదువుగా వస్తాయి. ఈలోపు పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. స్టవ్
మీద ఒక గిన్నె పెట్టి,అందులో ఒక గ్లాసు పంచదార, అర గ్లాసు నీళ్లు పోసి
వేడి చేయండి. పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికించాలి. మంచి
సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి, కొన్ని కుంకుమపువ్వు రేకులను
కలపండి. పాకం మరీ చిక్కబడకూడదు. పాకం చల్లారాక గట్టిపడకుండా ఉండటానికి
అందులో ఒక చుక్క నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోండి.
మాల్పువాలను నూనెలో వేయించడం
అరగంట తర్వాత పిండిని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్
వెలిగించి ఒక చదునైన అడుగు ఉన్న ఫ్లాట్ పాన్ లేదా కడాయి పెట్టుకోండి.
అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. నూనె
వేడెక్కిన తర్వాత, ఒక చిన్న గిన్నె లేదా గరిటెతో కొద్దిగా పిండిని
తీసుకుని నెమ్మదిగా నూనెలో పోయండి. పిండి దానంతట అదే గుండ్రంగా
వ్యాపించి మాల్పువా ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఒకవేళ పిండి
వ్యాపించకపోతే, పిండిలో మరికొన్ని నీళ్లు కలిపి కొద్దిగా పల్చగా
చేసుకోండి.
పాకంలో వేయడం మరియు వడ్డించడం
మాల్పువాలను లోపల పచ్చిగా లేకుండా ఉండటానికి మీడియం ఫ్లేమ్ మీ ద
మాత్రమే వేయించాలి. అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించుకోవాలి. ఆ
తర్వాత వాటిని బయటకు తీసి, అదనపు నూనెను గట్టిగా పిండేయండి. ఇలా
వేయించిన వేడి వేడి మాల్పువాలను వెంటనే ముందుగా సిద్ధం చేసుకున్న
పంచదార పాకంలో వేసి ముంచాలి. కొద్దిసేపటి తర్వాత మాల్పువాలు పాకాన్ని
పీల్చుకున్నాక, వాటిని బయటకు తీసి వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
