Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
నోరూరించే కమ్మని మామిడికాయ పప్పు.. రుచికి అమృతం కూడా సాటిరాదు!
ఎండాకాలం వస్తే చాలు ఏడాది పొడవునా నిల్వ ఉండే ఆవకాయ, మామిడికాయ తురుము పచ్చడి లాంటివి పెట్టుకోవడంలో మనవాళ్లు బిజీ అయిపోతారు. అయితే మామిడితో కేవలం పచ్చళ్లే కాకుండా ఎన్నో అద్భుతమైన వంటకాలు చేసుకోవచ్చు. మామిడికాయ పులిహోర, మామిడి సాంబార్, మామిడికాయ రసం, మామిడి పకోడీ, చట్నీ వంటివి చాలా ప్రసిద్ధి. వీటన్నింటిలోనూ అత్యంత ప్రత్యేకమైనది, ప్రతి ఒక్కరి మనసు దోచుకునేది మామిడికాయ పప్పు.
వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, పుల్లపుల్లని మామిడికాయ పప్పు కలుపుకుని తింటే ఆ రుచే వేరు. అమృతం కూడా దీనికి సాటి రాదేమో అనిపిస్తుంది. నోరూరించే మామిడి పప్పును చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మామిడికాయ పప్పు తయారీకి కావలసిన పదార్థాలు
కందిపప్పు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చి మామిడికాయ - 1
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 4
పసుపు - పావు టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - అవసరమైనన్ని
కొత్తిమీర తరుగు - కొద్దిగా
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మినపపప్పు - అర టీస్పూన్
ఎండు మిరపకాయ - 1
కరివేపాకు - 1 రెమ్మ
మామిడికాయ పప్పు తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకుని, నీటిలో రెండుసార్లు శుభ్రంగా కడగాలి.
-కడిగిన కందిపప్పును ప్రెషర్ కుక్కర్ లో వేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పుల్లటి మామిడికాయ ముక్కలు,పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కొద్దిగా ఇంగువ వేయాలి. ఇప్పుడు పప్పు, ముక్కలు మునిగేంత వరకు సుమారు రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. స్టవ్ వెలిగించి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
-ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి, పప్పు గుత్తితో పప్పును మెత్తగా ఎనుపుకోవాలి.
-మెత్తగా రుబ్బుకున్న ఈ పప్పులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరమైతే మరో కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి సన్నని మంటపై రెండు నిమిషాలు మరగనివ్వాలి.
-ఇప్పుడు తాలింపు కోసం మరో స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
-గుమగుమలాడుతున్న తాలింపును మరుగుతున్న పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నోరూరించే కమ్మని మామిడికాయ పప్పు రెడీ.
-వేడి అన్నం, మామిడి పప్పు, దానికి తోడుగా ఒక అప్పడం లేదా వడియం ఉంటే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
