Latest Updates
-
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా
తెలంగాణ స్టైల్ బోటి ఫ్రై.. ఇలా చేసుకుంటే నోట్లో కరిగిపోతుంది! ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు!
నాన్ వెజ్ ప్రియులకు బోటి అంటే చాలా ఇష్టం ఉంటుంది. బోటి కూర అయినా, బోటి ఫ్రై అయినా తినడానికి చాలా ఇష్టపడుతుంటారు. అయితే బోటి కూర కంటే బోటి ఫ్రై చాలా రుచిగా ఉండడంతో పాటు సులభంగా చేసుకోవచ్చు. దీనిని చేసుకోవడానికి కూడా అంత సమయం పట్టదు. అది కూడా తెలంగాణ స్టైల్‌లో బోటి ఫ్రై చేసుకొని తింటే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. అసలు తెలంగాణ స్టైల్‌లో బోటి ఫ్రై ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలంగాణ స్టైల్ బోటి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు
- అర కిలో బోటి
- సన్నగా తడుముకున్న ఒక ఉల్లిపాయ
- మూడు చెంచాల నూనె
- మూడు పచ్చి మిర్చి
- కరివేపాకు
- ఒక టేబుల్ స్పూన్ అల్లం
- అర టీస్పూన్ పసుపు
- రుచికి తగినంత ఉప్పు
- ఒక టేబుల్ స్పూన్ కారం
- ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి
- ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా
- కొద్దిగా కొత్తిమీర
- కొద్దిగా పుదీనా
తెలంగాణ స్టైల్ బోటి ఫ్రై తయారీ విధానం
ముందుగా మనం తెచ్చుకున్న అరకిలో బోటిని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తరువాత ఆ బోటిని రెండు లేదా మూడు నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. అలా ఉడికించుకొని, కడుక్కున్న బోటిని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలో మూడు చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకులు వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్‌లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తరువాత అందులో చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి.
ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమం కాసేపు వేగిన తరువాత అందులో ఉడికించి పెట్టుకున్న బోటిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని ఓసారి కలుపుకోవాలి. అనంతరం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. బోటి కొద్దిసేపు ఉడికిన తరువాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి.
అనంతరం కడాయిపై ఓసారి మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. కాసేపు వేగిన తరువాత మూత తీసి అందులో రుచికి సరిపడా ఉప్పు లేకపోతే ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక్క నిమిషం అయిపోయిన తరువాత మూత తీసి కలుపుకొని కిందకు దించుకుంటే తెలంగాణ స్టైల్ బోటి ఫ్రై సిద్ధమైనట్లే. దీనిని అన్నంలో తినొచ్చు. మందు పార్టీలో స్నాక్‌గా ఉపయోగించుకోవచ్చు. అలానే కూడా తినేయొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
