For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థాయ్ గ్రీన్ కర్రీ రెసిపీ తయారుచేయడం ఎలా

Posted By: Lalitha Lasya Peddada
|

థాయిలాండ్ లో గ్రీన్ కర్రీ అనేది ప్రసిద్ధి చెందిన వంటకం. క్రీమీ టెక్స్చర్ తో ఉండే ఈ వంటకం కాస్తంత తీపిగా కూడా ఉంటుంది. కొబ్బరి పాలను ఉపయోగించి దీనిని తయారుచేస్తారు. ఈ వంటకం యొక్క రంగు వలన ఈ వంటకానికి గ్రీన్ కర్రీ అనే పేరు వచ్చింది.

అయితే, అన్ని రకాల థాయ్ వంటకాలు తీపిగా ఉంటాయని మనం భావించలేం. ఎందుకంటే, కొన్ని రకాల థాయ్ వంటకాలు స్పైసీగా కూడా ఉంటాయి. ఈ కర్రీని వివిధ రకాలుగా చేసుకోవచ్చు. కూరగాయలను కలిపి ఒక రకంగా తయారుచేయవచ్చు.

అలాగే, ఇంకొన్ని పదార్థాలని కలిపి మరొక రకంగా తయారుచేయవచ్చు. ఈ థాయ్ గ్రీన్ కర్రీ రెసిపీని ఇంటివద్దే ప్రయత్నించి రుచి చూడండి.

థాయ్ గ్రీన్ కర్రీ రెసిపీ | థాయ్ గ్రీన్ కర్రీ రెసిపీని ఎలా తయారుచేయాలి | హోంమేడ్ థాయ్ గ్రీన్ కర్రీ
థాయ్ గ్రీన్ కర్రీ రెసిపీ | థాయ్ గ్రీన్ కర్రీ రెసిపీని ఎలా తయారుచేయాలి | హోంమేడ్ థాయ్ గ్రీన్ కర్రీ
Prep Time
50 Mins
Cook Time
35M
Total Time
1 Hours25 Mins

Recipe By: పూజా గుప్తా

Recipe Type: మెయిన్ కోర్స్

Serves: 2

Ingredients
 • 20 నిమిషాల పాటు 2 కప్పుల చల్లటి నీటిలో నానబెట్టబడిన రోల్డ్ ఓట్స్ - అర కప్పు

  క్రీమ్డ్ కోకోనట్ - 1 ½ టేబుల్ స్పూన్

  తురిమిన కొబ్బరి - 1 టీస్పూన్

  నూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్

  కేరట్స్ - 2

  తరిగిన ముల్లంగి - 1

  చిన్న చిన్న ముక్కలుగా తరుగుకున్న స్వీట్ పొటాటో - 1

  మర్మైట్ - ¼ టీస్పూన్

  కాఫిర్ లైమ్ లీవ్స్ (ఎండినవి లేదా తాజావి) - 2

  మొలకెత్తిన పర్పుల్ బ్రొకోలీ - 6

  పొడుగ్గా సగానికి కట్ చేసినవి

  ఫ్రోజెన్ బఠాణీలు - ¾ కప్పు

  నిమ్మకాయ - 1

  ఆరు భాగాలుగా కట్ చేయబడినది

  పేస్ట్ తయారీ కోసం

  సన్నగా తరగబడిన గ్రీన్ పెప్పర్ - 1

  కొత్తిమీర ప్యాక్ - ½ చిన్నది

  పీల్ చేసిన వెల్లుల్లి రెబ్బ - 1

  అల్లం ముక్క - 2 సెంటీమీటర్ల పొడవు కలిగిన చిన్నవి 3 టేబుల్ స్పూన్స్

  పీల్ చేసిన జెస్ట్ జ్యూస్ - 1 నిమ్మకాయ

  స్ప్రింగ్ ఆనియన్స్ - 2

  తురిమినవి

  గ్రీన్ చిల్లీ - 1

  సర్వ్ చేయడానికి

  బ్రౌన్ రైస్

  కొత్తిమీర ప్యాక్ (ఆప్షనల్) - కొన్ని రెమ్మలు

How to Prepare
 • మొదటగా పేస్ట్ ను తయారుచేసుకోండి.

  పేస్ట్ తయారీకి కావలసిన పదార్థాలని ఫుడ్ ప్రాసెసర్ లో వేసి వాటిని మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోండి.

  ఇప్పుడు వీటిని చిన్న పాత్రలోకి తీసుకుని ఓ పక్కన ఉంచండి.

  ఇప్పుడు ఓట్స్ ని నానబెట్టిన నీటితో పాటు ఓట్స్ ని కూడా ఫుడ్ ప్రాసెసర్ లో పెట్టి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.

  ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టండి.

  వీటిలో క్రీమ్డ్ కొబ్బరిని కలిపి ఒక పక్కన పెట్టండి.

  ఇప్పుడు, పెద్ద నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ఫ్యాన్ ను తీసుకుని హై హీట్ లో ఉంచండి.

  వీటిలో కొబ్బరినూనెను వేసి ఆ తరువాత కేరట్, ముల్లంగి మరియు స్వీట్ పొటాటోను జతచేయండి.

  దాదాపు 2 నుంచి మూడు నిమిషాల వరకు వీటిని కాస్తంత ఫ్రై చేయండి. కూరగాయల చివర్లలో రంగు మారేవరకు వీటిని వేచాలి.

  ఇప్పుడు కర్రీ పేస్ట్ ను జోడించి కర్రీలోని నీరు ఇంకిపోయే వరకు కుక్ చేయండి.

  ఓట్ మిల్క్ తో పాటు కొబ్బరి మిశ్రమాన్ని, మర్మైట్, నిమ్మ ఆకులూ అలాగే 300 గ్రాముల నీటిని వీటిలో జోడించి బాగా మరగబెట్టండి.

  ఇప్పుడు ప్యాన్ ను కవర్ చేసి 15 నిమిషాల వరకు కుక్ చేయండి. ఇప్పుడు, బ్రొకోలీని అలాగే 50 మిల్లీ లీటర్ల నీటిని ఇందులో కలపండి .

  మరొక అయిదు నిమిషాల పాటు కుక్ చేయండి.

  ఆ తరువాత, ఫ్రోజెన్ బఠాణీలను జోడించి ఒక నిమిషం పాటు కుక్ చేయండి.

  ఇప్పుడు, ప్యాన్ ను స్టవ్ పై నుంచితొలగించి, రెండు నిమ్మ చెక్కల నుంచి ఇందులోకి రసాన్ని పిండండి.

  బ్రౌన్ రైస్ తో వెంటనే వడ్డించండి. మీకు నచ్చితే మిగిలిన నిమ్మ చెక్కల రసాన్ని కూడా ఇందులో పిండండి. ఆలాగే, కొత్తమీరను చల్లుకోండి.

Instructions
 • ఎలాగో వడగడుతాం కాబట్టి ఓట్స్ ని ముందుగా శుభ్రపరిచే అవసరం లేదు.
Nutritional Information
 • సర్వింగ్ సైజ్ - పైన చెప్పిన విధంగా తయారుచేయబడిన మొత్తం పదార్థంలో
 • కేలరీలు - 2865
 • ఫ్యాట్ - 191 గ్రాములు
 • ప్రోటీన్ - 43 గ్రాములు
 • కార్బోహైడ్రేట్స్ - 248 గ్రాములు
 • చక్కెర - 9 గ్రాములు
 • డైటరీ ఫైబర్ - 8 గ్రాములు
[ 5 of 5 - 89 Users]
English summary

Thai Green Curry Recipe | How To Prepare Thai Green Curry | Homemade Thai Green Curry

Thai green curry is a traditional Thai recipe that is prepared asa. Curry and is served with rice. The Thai green curry can be made with just mixed vegetables or with meat as well. The green curry is a creamy, thick and rich gravy that is cooed with vegetables. Here is a recipe on how to prepare the Thai green
Story first published: Wednesday, January 24, 2018, 17:30 [IST]