Latest Updates
-
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది!
నిద్ర అంటే రెస్ట్ కాదు..నిద్ర గురించి 90 శాతం మందికి తెలియని నిజాలివే!
నిద్ర.. మన శరీరానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. కానీ ఉరుకులు పరుగుల జీవితం, స్మార్ట్ ఫోన్ల మోజులో పడి చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిద్ర గురించి 90 శాతం మందికి తెలియని నిజాలను తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలోని సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ పీడియాట్రిషన్, నియోనాటాలజిస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియోలో చెప్పారు.

లేటుగా పడుకుంటే.. లాభం లేదు
చాలామంది రాత్రి 2 గంటలకు పడుకుని మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నిద్రలేస్తుంటారు. 8 గంటలు పడుకున్నాం కదా అనుకుంటారు. కానీ డాక్టర్ చెబుతున్న దాని ప్రకారం.. లేటుగా పడుకుని ఎన్ని గంటలు నిద్రపోయినా అది వృధానే. రాత్రి 11 గంటల లోపు నిద్రపోతేనే దాని పూర్తి ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ'కి చెందిన UK బయోబ్యాంక్ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రాత్రి 10 నుండి 11 గంటల మధ్య నిద్రపోయే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అత్యంత తక్కువని ఈ పరిశోధనలో తేలింది. మన శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ (బయలాజికల్ క్లాక్) రాత్రి వేళలోనే మెలటోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేసి శరీరాన్ని బాగుచేస్తుంది.
నిద్ర అంటే విశ్రాంతి కాదు.. బ్రెయిన్ రిపేర్
నిద్ర అంటే కేవలం కళ్ళు మూసుకుని శరీరానికి రెస్ట్ ఇవ్వడం కాదు. అదొక బ్రెయిన్ రిపేర్ టైమ్. ప్రపంచంలో అత్యంత తెలివైన వారు కనీసం 8 గంటలు నిద్రపోతారట. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏకంగా రోజుకు 10 గంటలు నిద్రపోయేవారట.
రోచెస్టర్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం.. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడులోని గ్లింఫాటిక్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. రోజంతా మెదడులో పేరుకుపోయిన వ్యర్థాలను ఇది ఫ్లష్ అవుట్ చేసి బ్రెయిన్ ను క్లీన్ చేస్తుంది.
6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే ముసలితనం
రోజుకు 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు త్వరగా వృద్ధాప్యం బారిన పడతారు. ఇమ్యూనిటీ దారుణంగా పడిపోతుంది, గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది అని డాక్టర్ హెచ్చరించారు. తక్కువ నిద్రపోవడం వల్ల ఒత్తిడిని పెంచే 'కార్టిసాల్' హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందని, ఇది గుండెపై భారం మోపుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే నిద్రలేమి వల్ల కణాల వయస్సును నిర్ధారించే టెలోమియర్స్ పొడవు తగ్గిపోయి, చర్మంపై త్వరగా ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు వస్తాయి.
మధ్యాహ్నం 20 నిమిషాల కునుకు..
మధ్యాహ్నం పూట 20 నిమిషాల పాటు చిన్న కునుకు తీయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, మధ్యాహ్నం గంటల తరబడి నిద్రపోతే మాత్రం శరీరానికి నష్టమే.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పైలట్లపై చేసిన పవర్ నాప్ స్టడీలో ఈ విషయం రుజువైంది. 26 నిమిషాల పాటు పడుకుంటే మెదడు చురుకుదనం 54 శాతం, పనితీరు 34 శాతం మెరుగుపడిందని నాసా తేల్చింది. కానీ అరగంట దాటి నిద్రపోతే స్లీప్ ఇనర్షియా అనే స్థితికి చేరుకుని మనిషి మరింత నీరసంగా మారతాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications