Latest Updates
-
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
వర్షాకాలంలో బట్టలు ఆరట్లేదా? ఈ చిన్న ట్రిక్స్ ట్రై చేయండి!
వేసవి వేడికి అల్లాడిపోయిన జనాలకు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చాయి. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలతో పాటుగా, మన తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న జల్లులు వాతావరణాన్ని అమాంతం చల్లబరిచాయి. ఈ అందమైన వాతావరణం వెనుకే గృహిణులకు ఓ పెద్ద సమస్య మొదలవుతుంది.. అదే బట్టలు ఆరబెట్టడం.

ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుని ఉండటం, సూర్యరశ్మి ఏమాత్రం లేకపోవడం వల్ల ఆరేసిన బట్టలు రోజుల తరబడి అలాగే తడిగా ఉండిపోతాయి. ఇలా ఎక్కువ సమయం బట్టలు తడిగా ఉండటం వల్ల వాటిపై బూజు (ఫంగస్), బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఆ బట్టల నుంచి భరించలేని ఒక వింతైన తడి వాసన వస్తుంటుంది.
మీరు కూడా ఈ వానాకాలంలో బట్టలు ఆరక, వాటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇంట్లోనే బట్టలను వేగంగా ఆరబెట్టుకోవడానికి, అలాగే వాటిని తాజాగా ఉంచుకోవడానికి సహాయపడే కొన్ని సులభమైన, అత్యంత ప్రభావవంతమైన చిట్కాలను ఇక్కడ చూడండి.
టవల్, ఐరన్ ట్రిక్
మీకు ఏదైనా డ్రెస్ అర్జెంట్ గా కావాలి, కానీ అదింకా తడిగానే ఉందా? అయితే ఈ ట్రిక్ భలే పనిచేస్తుంది. బాగా తడిగా ఉన్న ఆ దుస్తులను తీసుకుని, ఒక మందపాటి, పొడిగా ఉన్న టవల్ లో రోల్ లాగా చుట్టండి. ఆపై గట్టిగా నొక్కండి. మీ బట్టల్లోని అదనపు తేమను ఆ టవల్ ఇట్టే పీల్చుకుంటుంది. ఆ తర్వాత కొద్దిగా తడి ఉన్న మీ దుస్తులను మామూలుగా ఇస్త్రీ చేయండి. ఇస్త్రీ పెట్టె వేడికి బట్టలు నిమిషాల్లో డ్రై అయిపోతాయి.
ఫ్యాన్ గాలి, సరైన వెంటిలేషన్
వాన పడుతున్నప్పుడు బయట ఆరేయలేం కాబట్టి ఇంట్లోనే బట్టలు ఆరేస్తుంటాం. ఇలాంటప్పుడు బట్టలు ఆరేసిన గదిలో సీలింగ్ ఫ్యాన్ ను హై స్పీడ్ ఉంచండి. అలాగే, ఆ గది తలుపులు, కిటికీలను తప్పనిసరిగా కాస్త తెరిచి ఉంచండి. ఇలా చేయడం వల్ల గదిలో గాలి ప్రసరణ జరిగి, బట్టల మీదున్న తేమ సులభంగా ఆవిరైపోతుంది. తలుపులు మూసేస్తే గదిలో ఉక్కపోత పెరిగి బట్టలు ఆరవు.
హ్యాంగర్ల అద్భుతమైన ఉపయోగం
చాలామంది తాడుపై బట్టలను నేరుగా ఒకదానిపై ఒకటి పడేలా ముడతలుగా వేలాడదీస్తారు. ఇలా చేయడం వల్ల బట్టల మధ్యకు గాలి వెళ్లదు. దీనికి బదులుగా బట్టలను హ్యాంగర్లకు తగిలించి, ఆ హ్యాంగర్లను తాడుకు వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల ప్రతి బట్టకు మధ్య తగినంత ఖాళీ ప్రదేశం ఏర్పడి, గాలి అన్ని వైపులా ప్రసరిస్తుంది. బట్టలు సమానంగా, చాలా వేగంగా ఆరుతాయి.

వాషింగ్ మెషీన్ లో డబుల్ స్పిన్ చేయండి
సాధారణంగా మనం బట్టలు ఉతికినప్పుడు ఒక్కసారి మాత్రమే స్పిన్ (Spin) చేస్తాము. కానీ ఈ వర్షాకాలంలో, మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు స్పిన్ సైకిల్ ను రెండుసార్లు రన్ చేయండి. ఇలా చేయడం వల్ల బట్టల్లోని అదనపు నీరు పూర్తిగా పిండేసినట్లు అవుతుంది. బట్టలు దాదాపు సగం పొడిగా బయటకు వస్తాయి కాబట్టి ఇంట్లో ఆరేసినప్పుడు చాలా త్వరగా ఆరిపోతాయి.
వాసనను పారద్రోలే వెనిగర్ లేదా బేకింగ్ సోడా
బట్టలు ఆరిపోయినా సరే, ఆ బూజు వాసన వస్తూనే ఉంటుంది. దీనిని నివారించడానికి, బట్టలు ఉతికే నీటిలో లేదా మెషీన్లో సర్ఫ్ తో పాటుగా ఒక టీస్పూన్ తెల్ల వెనిగర్ లేదా బేకింగ్ సోడాను కలపండి. ఇది అద్భుతమైన డియోడరైజర్ గా పనిచేస్తుంది. బట్టలలో దాగున్న బ్యాక్టీరియాను చంపి, దుర్వాసనను పారద్రోలి, మీ దుస్తులను ఎప్పటిలాగే ఫ్రెష్ గా, సువాసనతో ఉంచుతుంది.



Click it and Unblock the Notifications
