Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
మీ బంధం కలకాలం నిలవాలంటే... ఒకరినొకరు ఈ 5 మాటలు ఎన్నటికీ అనుకోకండి!
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం అనే పునాదులపై నిర్మితమైన ఒక అందమైన జీవితకాలపు బంధం. ప్రతి భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సహజమే. అలిగితేనే కదా ప్రేమ తెలిసేది అని కూడా అంటారు.

అయితే కోపంలో మన నోటి నుండి జారే కొన్ని మాటలు మన బంధంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. వింటి నుండి విడిచిన బాణాన్ని, నోటి నుండి జారిన మాటను ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. అందుకే ఎంత కోపంలో ఉన్నా, మీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ అనకూడని, చేయకూడని 5 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీ వైవాహిక జీవితంలో చిచ్చు రేపకుండా కాపాడుతాయి.
నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అనే మాట వద్దు
భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా సరే నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేసుకున్నాను అని పొరపాటున కూడా అనకండి. కోపంలో మీ నోటి నుండి వచ్చే ఈ ఒక్క మాట మీ భాగస్వామి గుండెను ముక్కలు చేస్తుంది. వారి మనసులో మీ పట్ల ఉన్న నమ్మకం ఒక్కసారిగా సన్నగిల్లుతుంది. ఆ ఒక్క మాట మీ ఇద్దరి మధ్య జీవితాంతం ఒక ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాటలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండండి.
ఆర్థిక పరిస్థితులను ఎగతాళి చేయకండి
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చక్రంలా తిరుగుతూ ఉంటుంది" అనే సామెత వైవాహిక జీవితానికి అక్షరాలా వర్తిస్తుంది. జీవితంలో ఆర్థిక ఎత్తుపల్లాలు సర్వసాధారణం. డబ్బు ఉన్నప్పుడు సంతోషంగా ఉండి, కష్టకాలంలో భాగస్వామి సంపాదన లేదా ఆర్థిక స్థితి గురించి చులకనగా మాట్లాడటం ఏమాత్రం తగదు. ఇది బంధానికి అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. కష్టకాలంలో ఒకరికొకరు కొండంత అండగా నిలవాలే కానీ, ఎగతాళి చేస్తూ కించపరుచుకోకూడదు.

బలహీనతలను ఎత్తిచూపుతూ అపహాస్యం చేయడం తగదు
ఈ సృష్టిలో ఏ వ్యక్తీ పరిపూర్ణుడు కాదు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని లోపాలు, బలహీనతలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి బలహీనతలను తెలుసుకుని, ఇతరుల ముందు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు వాటిని ఎగతాళి చేయడం మానుకోండి. పదే పదే లోపాలను ఎత్తి చూపడం వల్ల వారు ఆత్మన్యూనతా భావానికి గురవుతారు. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే, తల్లిదండ్రుల మధ్య జరిగే ఇలాంటి సంభాషణలు వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
కుటుంబ సభ్యులను గొడవల్లోకి లాగకండి
చాలా మంది జంటలు చేసే అతి పెద్ద తప్పు ఇది. భార్యాభర్తల మధ్య వాదన మొదలవగానే, ఏమాత్రం సంబంధం లేని ఒకరి కుటుంబ సభ్యులను మరొకరు విమర్శించడం మొదలుపెడతారు. అత్తింటి వారిని విమర్శించడం, నిందించడం లేదా వ్యంగ్యంగా మాట్లాడటం వల్ల పరిస్థితి చక్కబడకపోగా మరింత జటిలం అవుతుంది. ఏ వ్యక్తయినా సరే తన కన్నవారిని ఎవరైనా విమర్శిస్తే సహించలేరు. ఇది ఇద్దరి మధ్య కోపాన్ని, ద్వేషాన్ని అమాంతం పెంచుతుంది.
మూడో వ్యక్తి దగ్గర మీ భాగస్వామి గురించి చెడుగా చెప్పకండి
ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి. కానీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలి. మీ బంధువులు, స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారి ముందు మీ భాగస్వామి గురించి చెడుగా మాట్లాడటం చాలా తప్పు. మీరు చెప్పిన మాటలు ఏదో ఒక రోజు వేరొకరి ద్వారా మీ భాగస్వామి చెవిన పడక మానవు. అప్పుడు మీ బంధం పూర్తిగా బీటలు వారుతుంది. కాబట్టి మీ సమస్యలను మీ వరకే ఉంచుకోవడం బెటర్.



Click it and Unblock the Notifications
