Latest Updates
-
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు!
బ్రేక్‌ఫాస్ట్‌లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.!
బ్రేక్‌ఫాస్ట్‌లోకి సేమియా ఉప్మా అంటే ఇష్టపడని వారుండరు. కానీ ఈ టిఫిన్‌తో వచ్చే చిక్కల్లా ఒకటే. ప్రిపేర్ చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఉప్మా అంటుకుపోతుంది. దీంతో ఎంత ఇష్టం ఉన్నా కడుపు నిండుగా ఇష్టంగా తినలేరు. కానీ ఈ పద్ధతిలో చేశారంటే అస్సలు అంటుకుపోకుండా పొడిపొడిగా వస్తూ భలే రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఉదయాన్నే హేవీగా కాకుండా పొట్టకి లైట్‌గా ఉంటుంది. టమాటా సేమియా ఉప్మా ఎలా తయారుచేయాలో చూద్దాం..

టమాటా సేమియా ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు..
నెయ్యి- మూడున్నర టీస్పూన్లు
సేమియా- కప్పు
వేరుశనగ పల్లీలు- గుప్పెడు
నూనె- టేబుల్ స్పూన్
పచ్చి శనగపప్పు- టీస్పూన్
మినప్పప్పు- టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
ఇంగువ- పావు టీస్పూన్
ఉల్లిపాయ- ఒకటి
వెల్లుల్లి రెబ్బలు- రెండు
పచ్చిమిర్చి- రెండు
కరివేపాకు- కొద్దిగా
టమాటాలు- రెండు
పచ్చిబఠాణీలు- పావు కప్పు
పసుపు- చిటికెడు
కారం- టీస్పూన్
ఉప్పు- టీస్పూన్
నీళ్లు- ఒకటిన్నర కప్పులు
టమాటా సేమియా ఉప్మా తయారీ విధానం
ముందుగా స్టవ్‌పైన పాన్ పెట్టి ఒకటిన్నర టీస్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత సేమియాను వేసి రంగు మారేవరకు దోరగా వేయించాలి. తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి.
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా 'గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్‌లో ఇలా చేసేయండి.!
ఇప్పుడు అదే పాన్‌లో టీస్పూన్ నెయ్యి వేసి పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

పాన్‌లో మిగిలిన నెయ్యి వేసుకోవాలి. తర్వాత టేబుల్ స్పూన్ నూనె వేసి కాగనివ్వాలి. ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇంగువ వేసి కలిపిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి.
ఇప్పుడు కచ్చాపచ్చాగ దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. టమాటా ముక్కలను చిన్నగా కట్ చేసి వేసి మగ్గనివ్వాలి. కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
పచ్చి బఠాణీలను వేసి కలిసి ఐదు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత వేయించిన సేమియాను వేసి పదినిమిషాల పాటు మీడియం మంటపైన ఉడికించాలి.

సేమియా ఉప్మా ఉడికిన తర్వాత పై నుంచి వేయించిన పల్లీలు వేసి గార్నిష్ చేసి మరోసారి కలపాలి. అడుగంటుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.!
ఈ విధానంలో చేసినట్లయితే తినేటప్పుడు పల్లీలు క్రిస్పీగా తగులుతుంటాయి. సేమియా ఉప్మా కూడా పొడిపొడిగా అంటుకోకుండా వస్తుంది. ఎంతసేపైనా గట్టిపడకుండా ఉంటుంది. దీనిని పల్లీ చట్నీతో తింటే ఆ రుచి అద్భుతం అంటే నమ్మలేరు. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
