Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్‌లో ఇలా చేసేయండి.!
ముస్లిం పండుగల్లో ప్రత్యేకంగా అట్రాక్ట్ చేసేవి నోరూరించే వంటకాలు. హలీమ్, బిర్యానీ, ఖీర్ ఇలా ఎన్నో రకాల స్పెషల్ రెసిపీస్ కనువిందు చేయడమే కాదు కడుపు నిండుగా తినేలా చేస్తాయి. అలాంటి వాటిలో గీ రైస్ ఒకటి. ముస్లిం పెళ్లిళ్లలో ఈ గీ రైస్ తప్పనిసరిగా ఉండాల్సిందే.. గీ రైస్‌ను చాలా సింపుల్‌గా ఇంట్లో కూడా రుచికరంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం టైం లేనప్పుడు లంచ్ బాక్స్‌లోకి ఈ రెసిపీని హడావుడి లేకుండా రెడీ అయిపోతుంది. ముస్లిం వెడ్డింగ్ స్టైల్ గీ రైస్ ఎలా తయారుచేయాలో చూద్దాం..

ముస్లిం వెడ్డింగ్ స్టైల్ గీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం- కప్పు
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె- రెండు టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు- టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు- రెండు
జీడిపప్పులు- పది
పచ్చిమిర్చి- నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
పుదీనా- గుప్పెడు
కొత్తిమీర- గుప్పెడు
ఉప్పు- టీస్పూన్
టమాటా- ఒకటి
నీళ్లు- ఒకటి ముప్పావు కప్పు
ముస్లిం వెడ్డింగ్ స్టైల్ గీ రైస్ తయారీ విధానం
ముందుగా బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి ఒక వెడల్పాటి బౌల్‌లో 30 నిమిషాల పాటు నాననివ్వాలి.
ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరిగాక, కొబ్బరి నూనె వేసుకోవాలి. వేడయిన తర్వాత మసాలా దినుసులు (దాల్చిన చెక్క, జాపత్తి, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, లవంగాలు(ఐదు), ఏలకులు(3), జాపత్రి, బిర్యానీ ఆకు) వేసి వేగనివ్వాలి.

సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి.
తర్వాత తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపాక చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

ఇప్పుడు ఒక గ్లాసుతో పాటు ముప్పావు కప్పు నీళ్లు(ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి) పోసి మరిగించాలి. నిమిషం పాటు మరిగిన తర్వాత మంట చిన్నగా పెట్టుకోవాలి.
ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని తీసుకుని మరుగుతున్న ఎసరులో వేసుకుని కలిపి మీడియం మంటపైన పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గీ రైస్ దగ్గరికి అవుతున్నప్పుడు మంటి చిన్నగా పెట్టి ఎసరు మొత్తం పీల్చుకునే వరకు ఉంచాలి.
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.!
గీ రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ ముస్లిం వెడ్డింగ్ స్టైల్ గీ రైస్ రెడీ.
ఈ స్పెషల్ రెసిపీ లంచ్ బాక్స్‌లోకి ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా గ్రేవీ లేదా రైతాతో ఈ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
