Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.!
శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి విశేష పూజలు, వ్రతాలు చేయడంతో పాటు ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా బెల్లంతో చేసే ప్రసాదాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఇంకా పెసరపప్పుతో చేసే స్పెషల్స్ తప్పనిసరిగా నైవేద్యాల్లో ఉండాల్సిందే.. ఈ సారి పెసరపప్పు, బెల్లంతో ఈ పాయసం చేసి చూడండి.. అది కూడా పాలు లేకుండానే ఎంతో అద్భుతమైన రుచితో. ఈ పద్ధతిలో చేశారంటే పెసరప్పపు పాయసం ఎంతసేపయినా గట్టిపడదు..

పెసరపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు- కప్పు
నీళ్లు- రెండున్నర కప్పులు
బెల్లం- రెండు కప్పులు
తాజా కొబ్బరి- ఒకటి
ఏలకుల పొడి- అర టీస్పూన్
జీలకర్ర పొడి- అర టీస్పూన్
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు పలుకులు- మూడు టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి ముక్కలు- పావు కప్పు
ఎండు ద్రాక్ష- టేబుల్ స్పూన్
ముందుగా పెసరపప్పును రంగు మారేవరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. అందులో నుంచి సగం తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా సగాన్ని ఇంకాస్త రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు రోస్ట్ చేసిన పెసరపప్పును రెండు సార్లు కడిగి కుక్కర్‌లోకి తీసుకోవాలి. రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
ఈలోపు స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో బెల్లం వేసి పావు కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక కాసేపు మరగనివ్వాలి.

ఇప్పుడు పచ్చి కొబ్బరికాయను ముక్కలను కట్ చేసి పావు కప్పును పక్కన పెట్టుకోవాలి. మిగతా ముక్కలను మిక్సీ బౌల్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి కొబ్బరి పాలను వడబోసి పక్కన పెట్టుకోవాలి.
కుక్కర్ మూత తీసి ఉడికిన పెసరపప్పులో కొంచెం చిక్కగా మరిగిన బెల్లం పానకం వేసి కలపాలి. కాసేపటి తర్వాత సగం కొబ్బరి పాలను పోసి పావు గంటసేపు ఉడికించాలి.
పాయసం అడుగంటకుడా ఉండేందుకు పదే పదే గరిటెతో కలియతిప్పాలి. ఇప్పుడు అందులో ఏలకుల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి ఉడకనివ్వాలి. పాయసం చిక్కగా అయినప్పుడు మిగిలిన కొబ్బరి పాలు వేసి కాసేపు మరిగించి పక్కన పెట్టాలి.
ఇప్పుడు స్టవ్‌పైన చిన్న తాలింపు పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి. అందులో జీడిపప్పు పలుకులు, పచ్చికొబ్బరి ముక్కలు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించాలి.
దీనిని పాయసంలో వేసి కలిపి గార్నిష్ చేసుకోవాలి. ఈ పాయసం మరీ చిక్కగా మరీ పలుచగా లేకుండా చూసుకోవాలి. లేదంటే దాని టేస్ట్ మారిపోతుంది.
ఈ పాయసం తాగేటప్పుడు పెసరపప్పు పలుకులు నోటికి క్రిస్పీగా తగులుతూ పాలతో చేసే పాయసాన్ని మించిన రుచితో అమోఘంగా ఉంటుంది. వచ్చే పండుగల్లో తప్పనిసరిగా ట్రై చేయాల్సిన స్వీట్ రెసిపీ ఇది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
