ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి

Posted By:

నల్లేరు కాడల గురించి ఎప్పుడైనా విన్నారా? వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నల్లేరు కాడలతో రొట్టెలు, పచ్చడి వంటివి చేసుకునేవాళ్లు మన పూర్వీకులు. అందుకే ఏ రోగాలు లేకుండా బలంగా ఉండేవాళ్లు. అన్ని రోగాలకు ఇది వజ్రాయుధం లాంటిది.

ఎముకలు పుష్ఠిగా ఉండటానికి , విరిగిన ఎముకలు అతకడానికి, ఎముకలు గుళ్లబారిపోకుండా రక్షించడానికి, కీళ్ల సందుల్లో వాపుని తగ్గంచడానికి...శరీరంలో ఉండే ఎముకల గూడు అంతటికి నల్లేరు కాడలు అద్భుతమైన లాభాన్ని కలిగిస్తుంది. పోషకాలలో దీన్ని మించినది లేదు. నల్లేరులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నల్లేరు కాడలతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Traditional Nalleru Pachadi Recipe in Telugu The Ultimate Secret to Strong Bones Joint Relief

నల్లేరు కాడలు రోటి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

-నల్లేరు కాడలు
-చింతపండు
-వెల్లుల్లి
-ఉప్పు
-ఎండుమిర్చి
-తాలింపు గింజలు
-కరివేపాకు
-జీలకర్ర
-నూనె
-ఇంగువ

ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్‌ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..

నల్లేరు కాడలు రోటి పచ్చడి తయారీ విధానం

-ముందుగా నల్లేరు కాడలను తీసుకొని శుభ్రంగా కడగాలి.

-తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో కారంకి సరిపడా కొన్ని ఎక్కువగానే ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించి తీసి వాటిని పక్కన పెట్టుకోండి.

-పొయ్యి మీద బాండీలో మిగిలిన అదే నూనెలో నల్లేరు కాడలని వేసి వేయించుకోవాలి.

-నల్లేరు కాడలు మగ్గేలోగా చింతపండు కడుక్కొని నానబెట్టుకోవాలి.

-నల్లేరు కాడలు మగ్గిన తర్వాత పొయ్యి మీద నుంచి వాటిని దించేయండి.

-ఇప్పుడు రోట్లో వేయించిన ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. తర్వాత ఇందులోనే వేయించిన నల్లేరు కాడలు వేసి దంచుకోవాలి.

-నల్లేరు కాడలను బాగా దంచిన తర్వాత అందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని దంచుకోవాలి. తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కూడా వేసి బాగా దంచుకోవాలి.

-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో 3 ఎండుమిరపకాయల ముక్కలు, ఇతర తాలింపు దినుసులు అన్నీ వేసి వేయించాక అందులో జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని వేయించాలి.

-వేగిన తాలింపుని రోట్లో దంచుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే నల్లేరు కాడల రోటి పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, September 27, 2026, 15:20 [IST]
Desktop Bottom Promotion