Latest Updates
-
క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాలు ఇవే.. -
దీపావళి స్పెషల్ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కారప్పూస మిక్చర్ చేసుకోండిలా.. -
ఇడ్లీ, దోశలోకి హోటల్ స్టైల్ చిన్న ఉల్లిపాయ చట్నీ..యమా రుచి బాసూ.. -
చికెన్ మజ్జిగ పులుసు..నెలల పాటు నాలుక మీద ఉండేపోయే రుచి..ఈజీగా చేసేయొచ్చు.. -
అరటిపండ్లు రెండు రోజులకే నల్లబడుతున్నాయా? ఇలా చేస్తే 4 వారాలైనా ఫ్రెష్ గా ఉంటాయి! -
ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్ -
రెండో పెళ్లి, జిమ్ ట్రైనర్ తో ఎఫైర్.. భర్తను చంపేందుకు భార్య పక్కా స్కెచ్..ఊహించని ట్విస్ట్ -
పాకం పట్టే పనిలేకుండా పాతకాలం నాటి పర్ఫెక్ట్ రాగి లడ్డు..ఎముకలు దృఢంగా మారతాయి! -
చియా, గుమ్మడి, సబ్జా.. ఏ గింజలు ఎలా తింటే శరీరానికి 100 శాతం పోషకాలు అందుతాయంటే? -
స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ బీట్ రూట్ జిలేబీ.. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
దీపావళి స్పెషల్ స్వీట్..తమిళనాడు సంప్రదాయ ఉక్కరై మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఈ ఏడాది నవంబర్ 8న దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. దీపావళి అంటేనే టపాసులతో పాటు రంగు రంగుల స్వీట్లు గుర్తుకొస్తాయి. దీపావళి నాడు ఇంట్లో రకరకాల స్వీట్లు తయారుచేస్తుంటారు. అయితే దీపావళికి తమిళనాడులోని చెట్టినాడ్, బ్రాహ్మణ కుటుంబాల్లో చేసే స్వీట్ ఉక్కరై.
చూసేందుకు మన పుట్నాల పొడి లేదా పుట్టులాగా పొడిపొడిగా ఉంటూ, నెయ్యి, బెల్లం కలయికతో నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే మృదువైన ఆకృతి దీని సొంతం. తమిళనాడు స్పెషల్ దీపావళి సంప్రదాయ స్వీట్ ఉక్కరై మీ ఇంట్లో ఈ దీపావళికి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
1 కప్పు శనగపప్పు(chana dal)
పావు కప్పు కొబ్బరి తురుము
3/4 కప్పు బెల్లం
పావు కప్పు వేడి నీళ్లు బెల్లం కరిగించడానికి
పప్పు నానబెట్టడానికి వేడి నీళ్లు
గ్రైండ్ చేయడానికి కంచెం నీళ్లు
1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె
2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి
8 జీడిపప్పులు
పావు టీస్పూన్ యాలకల పొడి
దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే పెళ్లిళ్ల స్టైల్ మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
తయారీ విధానం
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పచ్చి శనగపప్పు వేసి తక్కువ మంట మీద మంచి సువాసన వచ్చి, లైట్ గా గోల్డెన్ కలర్ లోకి మారేదాకా వేయించాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి, వేడి నీళ్లు పోసి 2 గంటలు, మెత్తగా అయ్యేదాకా నానబెట్టాలి.
-శెనగపప్పు మెత్తగా నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేయండి, ఇందులోనే కొబ్బరి తురుము, కొంచెం నీళ్లు వేసి కొంచెం గట్టిదనంగా, కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి వేయించి వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-పాన్ లో ఉన్న నెయ్యిలోనే, నువ్వుల నూనె కూడా వేసి వేడయ్యాక ఇందులో గ్రైండ్ చేసిన శనగపప్పు పేస్ట్ వేసి తక్కువ మంట మీద ఉండలు విగొడుతూ మెత్తగా ఉడికి, అంటుకోని పొడిపొడిగా అయ్యేదాకా ఉడికించండి. తర్వాత దానిని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లారనివ్వండి.
-తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో బెల్లం వేసి, పావే కప్పు వేడి నీళ్లు పోసి బెల్లం కరగనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కరిగిన బెల్లం మిశ్రమాన్ని వడకట్టి వేసి, ఇందులోనే యాలకల పొడి వేసి కలపండి. పాకాన్ని మరిగించేటప్పుడు అందులో నుంచి ఒక చుక్కను నీటిలో వేసి చూస్తే అది గట్టిగా ఉంటూనే నొక్కితే అణిగేలా (మెత్తగా ఉండేలా) ఉండాలి. రాయిలా గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి.
-తర్వాత అందులో గ్రైండ్ చేసి వేయించిన శనగపప్పు తురుము, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి.
-తర్వాత అందులో వేయించిన జీడిపప్పు, 1 టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయండి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-అంతే దీపావళి స్పెషల్ ఉక్కరై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
