Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
రెడ్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రిసిపి: టేస్టీ అండ్ హెల్తీ
నిజానికి, కాలీఫ్లవర్ కన్నా విలువైన పోషకాలను కలిగి ఉన్నది క్యాబేజ్. విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్ ఆరోగ్యదాయకమైన ఎన్నో పైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ నిరోధక కాయగూరలలో రారాజు. క్యాన్సర్‌ను నిరోధించే బయో ఫ్లావనాయిడ్స్ క్యాబేజ్లో పుష్కలంగా ఉంటాయి. పీచుపదార్థం ఎక్కువ. అందువలన మల విసర్జన సాఫీగా జరగటానికి, వ్యర్థ పదార్థాల బహిష్క రణకు దోహద పడుతుంది. వంధ్యత్వాన్ని పోగొడుతుంది. రేచీకటిని, చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని, ఊడిపోవడాన్ని నివారిస్తుంది.
క్యాబేజ్ లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9లు ఉన్నాయి. అంతేగాకుండా ప్రోటీన్లు, ఫాస్పరస్, పొటాషియంలు కూడా కలిగివుంది. అందుచేత వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాబేజ్ ను వంటకాల్లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇలాంటి వంటల్లో క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం...


కావల్సిన పదార్థాలు:
రెడ్ క్యాబేజ్: 250grms
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 4-6
నూనె: 2tbps
అన్నం: 1cup
పసుపు చిటికెడు
ఇంగువ: చిటికెడు
ఆవాలు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడిచేయాలి. వేడి అయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి ఒకనిముషం ఫ్రై చేసుకోవాలి.
2. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న పచ్చిమిర్చి వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. క్యాబేజ్ వేగుతున్నప్పుడు అందులో ఉప్పు, పసుపు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి.

6. మంటను పూర్తిగా తగ్గించి, క్యాబేజ్ మిశ్రమం, అన్నం రెండూ కలగలిసేలా మిక్స్ చేయాలి. ఇలా తయారైన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే రెడ్ క్యాబేజ్ పులావ్ రిసిపి రెడీ.




Click it and Unblock the Notifications