Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
షుగర్ పేషంట్స్ కు కాకర-బంగాళదుంపతో ఓ వెరైటీ రుచి...
కాకరకాయ కాకర (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మంచి ఔషదంగా గావాడుతున్నారు. కాయ, కాకర రసము, కాకర ఆకులు మంచి ఔషధాలుగా ఉపయోగ పడతాయి. కాకర రసములో " హైపోగ్లసిమిక్ " పదార్ధము ఇన్‌సులిన్ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లొని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది . కాకర గింజలల లో రక్తము లో గ్లూకోజ్ ను తగ్గించే " చారన్‌టిన్ " అనే ఇన్సులిన్ వంటి పదార్ధము ఉంటుంది.
కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉంటుంది. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటం కూడా జరుగుతుంది. దీనిలో నీరు తక్కువ. పౌష్టిక శక్తి ఎక్కువ. మరి ఇన్ని ఔషధగుణాలు ఆరోగ్యానికి మేలు చేసే కాకకరతో ఓ మంచి వెరైటీ వంటకం తయారు చేసి తింటే ఎలా ఉంటుంది.?ఆలస్యం ఎందుకూ స్టెప్ బై స్టెప్ చూడండి రుచిని మీరూ ఆరగించండి:
కావల్సిన పదార్థాలు:
కాకరకాయలు: : 500gms
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 2-3
బంగాళదుంప: 1(small)
కొత్తిమీర తరుగు: 2tbps(chopped)
జీలకర్ర: ½ tsp
ఇంగువ: చిటికెడు
ఆమ్చూర్(ఎండిన మామాడికా పొడి): 1tsp
పసుపు: 1/4tsp
కారం: ½ tsp
ధనియాల పొడి: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానం:

ముందుగా కాకరకాయను చక్రాల్లా కావల్సిన సైజులో ఇలా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి శుభ్రం చేసి, ఒక బౌల్లోనికి తీసుకొని మళ్ళి కొద్దిగా ఉప్పును చిలకరించి రెండు మూడు గంటలు అలా పక్కన పెట్టుకోవాలి. ఎండలో కూడా పెట్టుకోవచ్చు. అందువల్ల అందులో ఉండే చేదు తగ్గుతుంది. షుగర్ పేషంట్స్ అయితే అలాగే డైరెక్ట్ గా వండుకోచ్చు. రెండు మూడు గంటల తర్వాత ఎండలోనుండి తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళు పోసిశుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.

బంగాళదుంపను మీడియం సైజ్ లోనిక కట్ చేసుకోవాలి వీటిని కొద్దిగా నూనె వేసి వేగించుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఉండనిచ్చి తర్వాత ఒక బౌల్లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

కడాయి(పాన్)లో నూనె వేసి కొద్దిగా జీలకర్ర వేసి, ఒక నిముషం తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీదు వేగించాలి.

ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేగి, లైట్ పింక్ కలర్ వచ్చేసమయం చూసి అందులో పచ్చిమిర్చి వేసి మరోనిముషం వేగించి అందులోనే ఫ్రైడ్ పొటాటో ముక్కలు కూడా వేసి మరో నిముషం పాటు వేగించాలి.

ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న కాకరకాయ ముక్కలను కూడా వేసి తక్కువ మంటమీద ఒక పది నిముషాల పాటు నిధానంగా వేగించాలి.

ఇప్పుడు ఉప్పు మరియు ఇతర మసాల దినుసులన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి.

తర్వాత మూత పెట్టి 5-10నిముషాలు పాటు బాగా కాకరకాయ ముక్కలు మెత్తబడే వరకూ వేగించాలి. చివరగా కొత్తిమీ తరగుతో గార్నిష్ చేసి ప్లెయిన్ రైస్ కు సైడ్ డిష్ గా సర్వ్ చేయాలి. అంతే కాకర బంగళాదుంప కాంబినేషన్ లో అద్భుతమైన రుచి మీ సొంతం...



Click it and Unblock the Notifications











