ఆలూకి కడి : నవరాత్రి స్పెషల్

దసరా దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు సంతోషంగా సందడిగా జరుపుకునే ఈ పండుగ భారత సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. ఉదయాన్నే మహిళలు లేచి ఇళ్ళు, వాకిళ్ళు కడిగి ముగ్గులు వేస్తారు. స్నానపానాదులు చేసి భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన దేవి మాతను కొలుస్తుంటారు.

నవరాత్రి స్పెషల్ గా ఇక్కడ ఒక స్పెషల్ రిసిపిని మీకు పరిచయం చేస్తున్నాం . నవరాత్రికి ఉపవాసదీక్షలు చేసే వారు , ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపవాసం ఉన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అలాంటి పోషకాహార వంటల్లో ఆలూకి కడీ ఒకటి. ఈ వంటను తయారుచేయడం చాలా సులభం మరియు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నవరాత్రి సమయంలో స్పెషల్ గా తయారుచేసుకొనే ఈ వంటను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Aloo Ki Kadhi: Navratri Vrat Recipe

కావల్సిన పాదార్థాలు:
బంగాళదుంప: 1/2kg(ఉడికించిన చిదిమి పెట్టుకోవాలి)
కారం పొడి: ½tsp
సింగారె కా అట్టా: ½cup
పెరుగు: 1cup
కరివేపాకు: 5
జీలకర్ర : 1tsp
ఎండుమిర్చి :2
అల్లం (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి): 1tbsp
ధనియాల పొడి: 1tsp
నూనె: 2 కప్పులు
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం, బంగాళదుంప, ఉప్పు మరియు సింగారె కా అట్ట వేసి, మెత్తగా కలుపుకోవాలి. అందులో 1/4భాగం పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిగిలిన పిండిలోంచి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా (పకోడాల్లా)చేయాలి.
3. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ ను స్టౌమీద పెట్టి నూనె సోసి కాగిన తర్వాత పకోడిల్లా ఉండలు చుట్టుకొన్న వాటని కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా పక్కకు తీసి పెట్టుకొన్న పిండిలో పెరుగును మిక్స్ చేయాలి. అలాగే 4కప్పుల నీరు కూడా పోసి బాగా మిక్స్ చేయాలి.
5. ఇప్పుడు పాన్ లో ఒక చెంచా నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి మరియు కరివేపాకు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
6. తర్వాత అందులోనే అల్లం తురుము, ధనియాల పొడి వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
7. మొత్తం వేగిన తర్వాత కలుపుకొన్న పిండి, మరియు పెరుగు మిశ్రమాన్ని పోపులో పోసి బాగా మిక్స్ చేసి, 5 నిముషాలు ఉడికించుకోవాలి.
8. తర్వాత ఉడుకుతున్న పెరుగు మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పకోడిలను వేసి బాగా మిక్స్ చేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఆలూ కి కడీ నవరాత్రి స్పెషల్ రిసిపి రెడీ.

Story first published: Thursday, September 25, 2014, 18:30 [IST]
Desktop Bottom Promotion