Latest Updates
-
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఆలూ పూరీ- టేస్టీ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి
భారతీయ వంటకాల్లో పూరీ కూడా ఓ చక్కటి బ్రేక్ ఫాస్ట్ వంటకం. భారతీయుల్లో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పూరీ, బంగాళదుంప కర్రీ, చట్నీతో లాగించేస్తుంటారు. అయితే కొంచె వెరైటీ గా ఆలూ స్టఫ్ చేసి తయారు చేసే ఆ ఆలూ పూరీ చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని ఈవెనింగ్ స్నాక్ గా కూడా తీనవచ్చు. ఆలూ పూరీ తయారు చేయడం చాలా సులభం. మరయు తక్కువ సమయం పడుతుంది. ఆలూ పూరీని ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి ఈ వెరైటీ ఆలూ పూరీ తయారు చేసి సర్వ్ చేయండి...

కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు: 5-6(ఉడికించి పొట్టుతీసి పెట్టుకోవాలి)
జీలకర్ర: 2tsp
మైదా: 5-6cups
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తరుగు: 1/2cup
కారం: 1tsp
బ్లాక్ పెప్పర్(మిరియాలు: 1/2tsp
నూనె: 2-3cups
నెయ్యి: 1-2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉడికించిన, పొట్టు తీసిర పెట్టుకొన్న బంగాళాదుంపల్ని ఒక బౌల్లోనికి తీసుకొని బాగా చిదిమి పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకొని, స్టౌ మీద పెట్టి అందులో జీలకర్ వేసి వేయించి, పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక గిన్నెలో మైదా పిండి వేసి అందులో ఉడికించి, చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను, వేయించి పెట్టుకొన్న జీలకర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కారం, బ్లాక్ పెప్పర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పూరిల పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఈ పిండిలో కొద్దికొద్దిగా పిండిని తీసుకొని బాల్స్ లా చేసి చపాతీలా వత్తి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె, నెయ్యి పోసి బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో వత్తిపెట్టుకొన్న పూరీలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి తీసి సర్వింగ్ బౌల్ పెట్టుకోవాలి. అంతే ఆలూ పూరీ రెడీ. దీన్ని ఆలూ కర్రీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications