Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బెంగాలీ స్వీట్ పులావ్ -స్పెషల్ రిసిపి
బెంగాలీ మిష్టీ పులావ్(స్వీట్ పులావ్). ఇది రైస్ డిష్. మిష్టీ అంటే స్వీట్. బెంగాలీ మిష్టీ పులవ్ కొద్దిగా స్వీట్ గా ఆరోమాటింక్ గా మరియు మంచి సువాసన కలిగి ఉంటుంది. ఈ వంటను కొన్ని ప్రత్యే సందర్బాల్లో మాత్రమే వండుతారు. ముఖ్యంగా పండుగలు మరియు పెళ్ళిళ్ళకు ఎక్కువగా వండుతుంటారు. ఈ బెంగాలీ మిష్టీ పులావ్ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ వంటను అలాగే ప్లెయిన్ గా తినవచ్చు లేదా మీకు నచ్చిన ఏదైనా గ్రేవీతో కూడా తినవచ్చు .
మరిన్ని పులావ్ & బిర్యానీ రిసిపిలు: క్లిక్ చేయండి
బెంగాలీ మిష్టి పులావ్ ను బాస్మతి రైస్ తో తయారుచేస్తారు. ఇది ఒక ఆరోమా వాసన కలిగి మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంటుంది. ప్రత్యేకంగా బెంగాల్ రైస్ ‘గోబిందో భోగ్' రైస్ తో తయారుచేస్తే మరింత రుచికరంగా ఉంటుంది. ఈ ఎక్సోటిక్ మరియు డెలిషియస్ రిసిపికి కొంచె గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి మరింత టేస్టీగా తయారుచేయవచ్చు. మరి ఈ అద్భుతమైన రుచికరమైన వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2cups
పసుపు: 2tsp
పంచదార 3tbsp
లవంగాలు -4
గ్రీన్ యాలకులు 4
బే ఆకు 1
జీడిపప్పు: 2tbsp (పలుకులుగా చేయాలి)
ఎండుద్రాక్ష: 2tbsp
నెయ్యి: 1tbsp
నీరు 4 cups
ఉప్పు: రుచికి సరిపడా
రుచికరమైన పీస్ పులావ్ :క్లిక్ చేయండి
తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రం చేసి నీటిలో అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బియ్యంలోని నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి, కాగిన తర్వాత అందులో నెయ్యి, యాలకులు, బిర్యానీ ఆకు వేసి మరో నిముషం వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులో నానెబట్టుకొన్న బియ్యం, పసుపు, పంచదార, మరియు ఉప్పు వేసి వేయించుకోవాలి.
4. లైట్ గా మిక్స్ చేస్తు 5నిముషాల పాటు మీడియం మంట మీద వేయించుకోవాలి.
5. తర్వాత సరిపడా నీరు పోసి అందులో జీడిపప్పు మరియు ద్రాక్ష వేసుకోవాలి.
స్పైసీ టమోటో-పుదీనా పులావ్: క్లిక్ చేయండి
6. మంటను మీడియంగా పెట్టి మూత పెట్టి 15నిముషాలు బియ్యం పూర్తిగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
7. ఒకసారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, పులావ్ ను సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి.
అంతే బెంగాలీ మిష్టి పులావ్(స్వీట్ పులావ్) సర్వ్ చేయడానికి రెడీ. ఈ స్పెషల్ పులావ్ ను అలాగే ప్లెయిన్ గా తినవచ్చు లేదా చికెన్ లేదా మటన్ కర్రీ కాంబినేషన్ తో తినవచ్చు.



Click it and Unblock the Notifications