Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కాకరకాయ సుక్కా రిసిపి-వెరీ టేస్టీ అండ్ హెల్తీ
కాకరకాయ చేదు వల్ల చాలా మంది తినరు. కానీ సరైన పదార్థాలు జోడించి, కొచ్చెం టెక్నికల్ గా ప్రయత్నిస్తే, చేదు లేకుండా అద్భుతమైన టేస్ట్ అంధిస్తుంది. ఇతర కూరగాయల్లాగే కాకరకాయను కూడా వండటం వల్ల అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది. టేస్ట్ చూసిన తర్వాత మీకు ఆశ్చర్యం కలగకమానదు.
బిట్టర్ గార్డ్ సుక్కా చాలా సులభం మరియు త్వరగా తయారు చేసే వంటకం. ఈ వంటను తయారుచేయడంలో ముఖ్యమైన ట్రిక్ ఏంటంటే కాకరకాయలోని చేదును తొలగించడమే. చేదు తొలగిపోవాలంటే కాకరకాయకు ముందుగానే నిమ్మరసం, కారం, ఉప్పు, పసుపుతో మ్యారినేట్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. దాంతో కాకరకాయలోని చేదంతా పూర్తిగా తొలగిపోతుంది. తర్వాత సరైన వస్తువులు, మసాలాలు ఉపయోగించి చేయడం వల్ల అద్భుతమైన టేస్ట్ అంధిస్తుంది. మరి మీరు బిట్టర్ గార్డ్ సుక్కా టేస్ట్ చేయాలంటే తయారు చేసే విధానం తెలుసుకోవాల్సిందే...

కావల్సిన పదార్థాలు:
కాకరకాయ: 4మీడియంసైజ్(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 పెద్దవి(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
టమోటాలు: 2పెద్దవి(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
బంగాళాదుంప: 1పెద్దది (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిరపకాయలు: 3(మద్యకు కట్ చేయాలి)
పసుపు: ¼tsp
కారం: ¼tsp
గరం మసాలా: ¼tsp
Jeera(జీలకర్ర) : ¼tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: ½tsp
కొబ్బరి తురుము: 4-5tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 2tsp
కరివేపాకు: రెండు కొమ్మలు
నూనె: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా కాకరకాయను ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా ఉప్పునీటిలో కడిగి, వాటికి ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం వేసి, బాగా మిక్స్ చేసి, ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గంట తర్వాత డీప్ బాటమ్ పాన్ లో తగినంత నూనె వేసి కాగిన తర్వాత అందులో నిమ్మమిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకొన్నకాకరకాయ ముక్కలు వేసి క్రిస్పీగా మరియు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద వేగించుకోవాలి. వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపేస్ట్ మరియు ఉల్లిపాయ ముక్కలువేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. కొన్ని నిముషాల తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. అలాగే బంగాళదుంప ముక్కలు బంగాళదుంపముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్ళు చేర్చి మూత పెట్టి ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో ముందుగా వేగించి పెట్టుకొన్న క్రిస్సీ కాకరకాయ ముక్కలు, గరం మసాలా, కొబ్బరి తురుము, ఉప్పును కూడా వేసి ఉడికించుకోవాలి. అంతే కాకరకాయ సుఖ్కా రిసిపి రెడీ. దీన్ని గోవాన్ రైస్ మరియు ప్రాన్ కర్రీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications