Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మరో ప్లేటు తినాల్సిందే ఈ పొంగల్...!

బియ్యం: 1cup
పెసరపప్పు: 1cup
వేయించుకోవడానికి:
నెయ్యి: 2tbsp
జీడిపప్పు: 10
మిరియాలు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
జీలకర్ర: 1tsp
ఇంగువ: చిటికెడు
పచ్చిమిర్చి: 2-4
అల్లం: చిన్న ముక్క
చిన్న పచ్చికొబ్బరి ముక్క
తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, పచ్చికొబ్బరి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత బియ్యం, పెసరపప్పును నీళ్ళల్లో శుభ్రం చేసి పక్కన పెట్టుకొని, తర్వాత ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఎండు మిర్చి వేసి, తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించుకోవాలి.
3. తర్వాత అందులోనే శుభ్రం చేసి పెట్టుకొన్నబియ్యం, పెసరప్పుకు సరిపడా నాలుగు కప్పుల నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ లో ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత అదే పాన్ లో మరి కొద్దిగా నెయ్యి వేసి అందులో జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని, జీడిపప్పును ముందుగా ఉడికించి పెట్టుకొన్న పొంగలికి కలిపుకోవాలి. బాగా మిక్స్ చేసి చింత గొజ్జు లేదా చట్నీతో హాట్ హాట్ గా సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications