Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
క్రిస్పీ ఫ్రైడ్ బ్రెడ్ బతూర : బ్రేక్ ఫాస్ట్ రిసిపి
ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ యమ్నీగా ఉంటే, ఇక ఆరోజంతా ఏదో తెలియని ఉత్సాహం, ఏపనులు మొదలుపెట్టాలన్నా ఉత్సహాంగా చేసేస్తుంటారు. బ్రేక్ ఫాస్ట్ ఆరోజుకు సరిపడా మూడ్ మరియు ఎనర్జీని అందిస్తుంది. అటువంటి వంటకాల్లో బ్రెడ్ బతూర ఒకటి . ఈ వంట బ్రేక్ ఫాస్ట్ కు తయారుచేసుకోవడం చాలా సులభం మరియు చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు .
బ్రెడ్ బతూర శెనగలతో తయారుచేసిన కర్రీ లేదా మరే ఇతర రుచికరమైన సాగ్ రిసిపికి చాలా చక్కటి కాంబినేషన్ . మరి మీకు సమయం ఉన్నప్పుడు ఈ స్పెషల్ యమ్మీ ఫ్రైడ్ బతూర రిసిపిని ఒకసారి ట్రై చేసి చూడండి...

కావల్సిన పదార్థాలు:
మైదా: 3cups
బేకింగ్ పౌడర్: 1tsp
సోడా బైకార్బొనేట్: 1/2tsp
ఉప్పు: చిటికెడు
పంచదార: 1tsp
నూనె: తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా మైదా మరియు బేకింగ్ పౌడర్, సోడా బైకార్బోనేట్ మరియు ఉప్పును ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో పెరుగు, ఉప్పు, మరియు పంచాదార వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసి, పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఈ పిండిలో రెండు చెంచాలా నూనె కూడా వేసి బాగా సాప్ట్ గా కలుపుకొని, దాని మీద ఒక తడిబట్టను కప్పి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత పిండిని నాలుగు బాగాలుగా చేసి ఉండలుగా చేసుకొని, వాటని చిన్న చిన్న పూరిల్లా రుద్దుకోవాలి.
5. ఇప్పుడు స్టౌమీద పాన్ పెట్టి నూనెపోసి వేడయ్యాక అందులో సరిపడా నూనె పోసి, బతూర(పూరిల)ను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే క్రిస్పీ బ్రెడ్ బతూర రెడీ.



Click it and Unblock the Notifications