Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
దాల్ షోర్బా- హెల్తీ ఇండియన్ సూప్
దాల్ షోర్బా చాలా టేస్టీ, మరియు హెల్తీ కూడా, ఇండియన్ మసాలాలతో తయారు చేసే, చిరుధాన్యపు డిష్ ఇది. ఈ సూప్ అద్భుతమైన రుచికలిగి, ఆకలిని కలిగించే సూప్ ఇది. లెంటిల్స్(పప్పు)ను పెసరపప్పు లేదా కందిపప్పును (రెడ్ కలర్ కందిపప్పును)సూప్ కు ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
ఈ పోషకాల సూప్ కు తాజా కొత్తిమీర, నిమ్మరసం చేర్చడం వల్ల అద్భుతమైన ఫ్లేవర్ తో మంచి రుచితో ఉంటుంది. ఈ లెంటిల్ సూప్ ను వర్షాకాలంలో తరచూగా తీసుకోవడం వల్ల శరీరానికి కొత్త ఉత్సహాం కలిగిస్తుంది. మరియు ఇది డిఫరెంట్ టేస్ట్ తో ఉండటం వల్ల పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడుతారు. మరి ఈ దాల్ షోర్బా ఎలా తాయరు చేయాలో ఒక సారి చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
కందిపప్పు లేదా పెసరపప్పు: grm
ఉల్లిపాయ చిన్నది: 1(సన్నగా తరగాలి)
అల్లం తురుము: 1tsp
పచ్చిమిర్చితరుగు: 1tsp
జీలకర్ర: 1tsp
వెల్లుల్లి తరుగు: 1tsp
వెన్న లేదా నెయ్యి: 1tsp
పసుపు: చిటికెడు
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1tsp
ఉప్పు: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
నిమ్మరసం: కొద్దిగా
తయారుచే విధానం:
1. ముందుగా పప్పును కడిగి పది నిముషాలు నీళ్లలో నానపెట్టాలి.
2. తరువాత అందులో పసుపు, సన్నగా తరిగిన అల్లం వేసి స్టౌ మీద ఉంచి, మెత్తగా ఉడికించి దింపేయాలి.
3. బాగా చల్లారిన తరవాత గరిటెతో మెదిపి తగినన్ని నీళ్లు పోసి పలుచగా చేయాలి.
4. పాన్‌లో వెన్న లేదా నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగులను వేసి కొద్దిగా వేయించాలి.
5. ఇందులో ముందుగా మెదిపి ఉంచుకున్న పప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ కలిపి మరో ఐదు నిముషాలు మరిగించి దింపి, వడకట్టాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications