Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
డీప్ మష్రూమ్ కర్రీ: వెరీ టేస్టీ అండ్ హెల్తీ
సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మంది మష్రుమ్(పుట్టగొడుల)రుచి, వాసన పట్టదు. అటువంటి వారు ఈ మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, వెంటనే తినడం ప్రారంభించేస్తారు. అన్ని గొప్ప ప్రయోజనాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయి.
పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? మనలో చాలామందికి డౌట్. దీనికి సమాధానం... ఒకసారి తిని చూడ్డం! డీప్ మష్రూమ్ కర్రీ, మష్రూమ్ కర్రీ, రాజ్మా మష్రూమ్ కర్రీ, టొమాటో పాస్తా కర్రీ, కొరమీను మష్రూమ్ పొరటు... వీటిలో ఏం తిన్నా మీకు ఒకటే అనిపిస్తుంది. ‘శాకాహరమైతేనేం? మాంసాహారమైతేనేం మష్రూమ్ ఇంత టేస్టుగా ఉంటే' అని!! ఇవే కాదు... ఇంకా రకరకాల ప్రయోగాలను మీరు మష్రూమ్‌తో చెయ్యొచ్చు. మీకోసం ఒక డీప్ మష్రుమ్ కర్రీ...

కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్: 2cups
చింతపండు: కొద్దిగా(నీళ్లలో నానబెట్టాలి)
ఉప్పు: రుచికి తగినంత
గరంమసాలా: 1tsp టీ స్పూను
శనగపప్పు: 1tbsp
మిరియాల పొడి: tsp
నూనె: 2tsp
ఆవాలు: 1/2tsp
ఎండుమిర్చి: 2
కొత్తిమీర: కొద్దిగా
ఉల్లిపాయ: 1ముక్కలుగా కట్ చేసుకోవాలి
టొమాటో ముక్కలు: 1/2cup
కరివేపాకు: 2 రెమ్మలు
తయారు చేయు విధానం:
1. ముందుగా చింతపండు గుజ్జు తీసి పక్కన ఉంచాలి.
2. తర్వాత పాన్ లో శనగపప్పు వేసి వేయించి మిరియాలపొడి జతచేసి కలిపి తీసేయాలి.
3. ఇప్పుడు పాన్‌లో నూనె కాగాక కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాక, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి.
4. అలాగే మష్రూమ్ ముక్కలు కూడా వేసి, ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టి, ఉడికించాలి.
5. తర్వాత చింతపండు గుజ్జు జత చేసి పది నిముషాలయ్యాక, గరం మసాలా వేసి 5 నిముషాలు ఉడికించి దించేయాలి.
6. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే డీప్ మష్రుమ్ కర్రీ రెడీ



Click it and Unblock the Notifications