Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
డెలిషియస్ సోయా చీజ్ కబాబ్!: రంజాన్ స్పెషల్
రెగ్యులర్ వెజిటేరియన్ ఆహారాలతో మీరు బోర్ గా ఫీలవుతున్నారా? మరి మీకోసం ఒక స్పెషల్ తడాక రిసిపిని అందిస్తున్నాము. వెజిటేరియన్ డిష్ ను నాన్ వెజ్ టేస్ట్ తో ఎలా తయారుచేస్తే ఎలాంటుందో అలాగే ఈ రోజు ఒక కొత్త స్పెషల్ వంటను పరిచయం చేస్తున్నాము.
సోయా చుంక్స్ ఉపయోగించి తయారుచేసే ఈ వంటలో న్యూట్రీషియన్ విలువలు ఎక్కువగా ఉన్నాయి. మరియు ప్రోటీనులు కూడా అధికంగా ఉన్నాయి. ఈ సోయా చీజ్ కబాబ్ తినడానికి చాలా టేస్ట్ గా ఉంటుంది . అంతే కాదు తయారుచేయడం కూడా చాలా సులభం మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బట్టర్ - 50 gms
సోయా చుంక్స్ - 250 gms
చీజ్ తురుము- 180 gms
యాలకలపొడి - 1/4 tsp
వైట్ పెప్పర్ పౌడర్ - 1/2 tsp
READ MORE: రంజాన్ స్పెషల్: కాశ్మీర్ మిర్చి కుర్మా రిసిపి
కార్న్ ఫ్లోర్- 10 gms
ఫ్రెష్ మిల్క్ క్రీమ్ - 150 ml
అల్ల-వెల్లుల్లిపేస్ట్ - 1 tsp
రోస్ట్ చేసిన ఉల్లిపాయలు - 100 gms
కొత్తిమీర- 10 gms
పచ్చిమిర్చి - 4
క్యాప్సికమ్ - 1
ఉప్పు-రుచికి సరిపడా
READ MORE: దహీ కబాబ్ రిసిపి : రంజాన్ స్పెషల్
తయారుచేయు విధానం:
1. ముందుగా సోయా చుంక్స్ నీళ్ళలో వేసి ఉడికించుకొని నీరు వంపేసుకోవాలి.
2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, వైట్ పెప్పర్ పౌడర్, యాలకలపొడి మరియు ఉప్పు ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత అందులోనే ఉడికించిన సోయా చుంక్స్ ను కూడా వేయాలి.
4. వీటిని పక్కన పెట్టి 15నిముషాలు మ్యారినేట్ అవ్వనివ్వాలి.
5. తర్వాత ఒక బౌల్లో చీజ్ తీసుకొని చేత్తో బాగా మిక్స్ చేయాలి. అలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది.
6. తర్వాత అందులో ఫ్రెష్ మిల్క్, కార్న్ ఫ్లోర్ మరియు ఉప్పు, చీజ్ మిశ్రమాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి.
7. మొత్తం మిశ్రమంలో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
8. తర్వాత కొత్తిమీర, రోస్ట్ చేసిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
READ MORE:ఖీమా టిక్కి: ఫ్రైడ్ మటన్ కట్ లెట్ : టేస్టీ ఈవెనింగ్ స్నాక్
9. ఈ పేస్ట్ ను చీజ్ మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. సోయా చుంక్స్ కు బాగా పట్టేలా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి .
10. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమం నుండి కొద్దిగా పక్కకు తీసి పెట్టి అందులో కొద్దికొద్దిగా తీసుకొని కబాబ్ లా వత్తుకోవాలి .
11. స్టౌ మీద ప్రైయింగ్ పాన్ పెట్టి అందులో ఒక టీస్పూన్ బటర్ వేసి కబాబ్స్ ను ప్లేస్ చేసి అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
12. ఫ్రై చేసుకొన్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి. సర్వ్ చేసే ముందు ఫ్రైడ్ ఉల్లిపాయలు మరియు క్యాప్సికమ్ తో గార్నిష్ చేయాలి.



Click it and Unblock the Notifications