Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
డెలిషియస్ వెజిటేబుల్ నవరతన్ కుర్మా రిసిపి
రోటీ, చపాతీ, లేదా బటర్ కుల్చాలు రుచికరమైన గ్రేవీలు లేకుండా వీటిని తినలేము. గ్రేవీలు రోటీ, చపాతీలకు మరింత అదనపు రుచులను అందిస్తాయి . అంతే కాదు ఈ రెండింటి కాంబినేషన్ యొక్క రుచి టేస్ట్ బడ్స్ ను చాలా అద్భుతమైన రుచిని అందిస్తాయి.
అలాంటి టేస్టీ డిష్ నవరతన్ కుర్మా, ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాము. ఈ నవరతన్ కుర్మాను తయారుచేయడానికి 9 రకాల వెజిటేబుల్స్ ను ఉపయోగిస్తున్నాము .
READ MORE: టేస్టీ పనీర్ నవరతన్ కుర్మా రిసిపి
సాధారణంగా ఇలాంటి స్పెషల్ వంటలను రెస్టారెంట్స్ లో ఎక్కువగా రుచి చూస్తుంటాము. కానీ అదే టేస్ట్ తో మనం ఈరోజు మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . ఇది హెల్తీ అండ్ రిచ్ గ్రేవీ రిసిపి. ఎండు ద్రాక్ష, జీడిపప్పు , వివిధ రకాల వెజిటేబుల్స్ బీన్స్, క్యారెట్స్, పచ్చిబఠానీలు, కాలీఫ్లవర్, టమోటోలు, వేసి మరింత టేస్టీగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ నవరతన్ కుర్మాను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బీన్స్ - 1cup(ఉడికించినవి)
క్యారెట్ - 1cup (ఉడికించినవి)
పచ్చిబఠానీలు - 1cup (ఉడికించినవి)
టొమాటోస్ - 2 cups
ఉల్లిపాయలు - 2cups
కాలీఫ్లవర్ - 1 cup (ఉడికించినవి)
పైనాపిల్ - 1 cup
బంగాళ దుంపలు - 1cup (ఉడికించినవి)
రెడ్ కాప్సికం - 1cup
జీడిపప్పు - 1cup
READ MORE:నోరూరించే చికెన్ కుర్మా: లక్నో స్పెషల్
ఎండుద్రాక్ష - 1/2 cup
పసుపు - 1/4 tsp
జీలకర్ర - 1/2tsp
ధన్య పౌడర్ - 1/2 tsp
కారం - 2tsp
గరం మసాల - 1/2tsp
అనాస రసం - 1 cup
క్రీమ్ - 2 tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్ : తగినంత
READ MORE:అదిరిపోయే టేస్ట్ తో మొఘలాయీ ఆలూ కుర్మాఅదిరిపోయే టేస్ట్ తో మొఘలాయీ ఆలూ కుర్మా
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడిఅయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, టమోటోలు, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. తర్వాత అందులో జీడిప్పు, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. మసాలాను పెస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, గరం మసాలా, కారం, ధనియాలపొడి మరియు పసుపు వేయాలి.
5. మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయలు, టమోటోలు, క్యాప్సికమ్, పైనాపిల్, పచ్చిబఠానీలు, క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు, ద్రాక్ష వేసి మిక్స్ చేయాలి.
6. తర్వాత దానికే కొద్దిగా నీరు మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. పైనాపిల్ జ్యూస్ ను టాపింగ్ గా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
7. చివరగా ఉప్పు వేసి కలపాలి. అంతే రుచికరమైన నవరతన్ కుర్మా రెడీ. ఈ రుచికరమైన డిష్ రోటీ, చపాతీ లేదా బటర్ కుల్చా, పీస్ పులావ్, గీ రైస్ కు అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications