Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ధనియా-ఆలూ సబ్జీ: శ్రావన మాస స్పెషల్
ఆలూ లేదా పొటాటో ఈ వెజిటేబుల్ ఎప్పటికీ మనకు బోరుకొట్టని ఒక రుచికరమైన వెజిటేబుల్ ఇది. తెలుగు నెలల ప్రకారం శ్రావణం మాసం మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతున్నది. ఇప్పటీకే చాలా మంది నార్త్ ఇండియన్స్ ఈ శ్రావన మాసం ఎక్కువగా దొరికే వేజిటేబుల్స్ మీద అప్పుడే వంటలు మొదలు పెట్టేశారు. ఎందుకంటే మనకంటే ముందు వారికి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అందుకే మనం కూడా ఇప్పటి నుండి శ్రావణంలో ఎటువంటి ఆహారాలు తినాలో, ఎటువంటివి తినకూడదో తెలుసుకొన్నచో కొన్ని ప్రయోజనాలను మనం కూడా పొందవచ్చు.
ఇక వంట విషయానికొస్తే ఈ ధనియా ఆలూ కి సబ్జీ చాలా మంది చాలా ఇష్టంగా తినేటటువంటి వెజిటేబుల్ ఇది. బంగాలు దుంపలతో వివిధ రకాలు, వెరైటీలుగా రోజూ చేసి పెట్టినా బోర్ అనిపించదు. అందుకే మీరు రెగ్యులర్ గా చేసుకొనే వంటకంటే కొంచెం డిఫరెంట్ గా ధనియా ఆలూ సబ్జీని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ వంట చాలా రుచికరంగా ,టేస్టీగా మరియు మంచి ఫ్లేవర్ తో నోరూరిస్తుంటుంది. మరి ఈ శ్రావన మాసంపు స్పెషల్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 4(ఉడికించి, మందంగా స్లైస్ గా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ : 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ధనియాలు: 1tbsp(పూర్తి పొడిగా కాకుండా రఫ్ గా చేసి పెట్టుకోవాలి)
ధనియాలపొడి: 2tsp
ఆమ్చూర్(డ్రై మాంగోపౌడర్): 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1tsp
కారం: 1tsp
నూనె: 2tbsp
కొత్తిమీర: 2tbsp(గార్నిషింగ్ కోసం)
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. తర్వాత అందులో రఫ్ గా పొడి చేసుకొన్నధనియాలు వేసి ఒకటి రెండు సెంకడ్స్ ఫ్రైచేసుకోవాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. 5నిముషాల తర్వాత పసుపు, కారం, ధనియాలపొడి, డ్రై మ్యాంగో పౌడర్, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని సమంగా మిక్స్ చేస్తూ మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఒకసారి ఇలా మొత్తం సమంగా ఫ్రై చేసుకొన్న తర్వాత స్టై ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిస్ చేయాలి. అంతే ధనియా ఆలూ కి సబ్జీ రెడీ. ఈ స్పెషల్ శ్రావణమాసం వంటకాన్ని చపాతీ, రోటీలతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications