Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
డ్రమ్ స్టిక్(మునక్కాడ)-టమోటో కర్రీ: హెల్తీ సైడ్ డిష్
వంటలకు ఘుమఘమలను అందించి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాటిలో చెప్పుకోతగ్గది మునగ, మునగకాడల్ని చారు, సాంబారు, కూర, పచ్చడి సూప్ వంటివెన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు.
భారతీయులకు సుపరిచితమైన కూరగాయాల్లో ఒకటి మునక్కాయ. కానీ చాలామంది ములక్కాయలోని పోషకవిలువలు గ్రహించక ఆహారంలో భాగంగా వచ్చే ములక్కాడ ముక్కలను పక్కన పెడుతుంటారు. అధిక మోతాదులో కాల్షియం ఉన్నందువల్ల పెరిగే పిల్లలకు, గర్భిణులకు మునక్కాడ దివ్యౌవుషధం. పీచుపదార్థం సమృద్ధిగా ఉండే మునక్కాడ జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. మునక్కాడతో తయారుచేసే రసాన్ని లేదా సూప్‌ను త్రాగడం వల్ల దగ్గు, కఫలం లాంటి శ్వాసకోస సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలైన అజీర్ణం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. మునక్కాడ రసంలో నిమ్మరసం చుక్కలు కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం చక్కటి కాంతిని సంతరించుకుంటుంది. మరి ఇన్ని సుగుణాలున్న మునక్కాడ-టమోటో కాంబినేషన్ తో ఒక స్పైసీ డిష్ తయారుచేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

కావలసినవి :
టమోటాలు: 1/2kg
మునక్కాయలు: 3
ఉల్లిపాయలు:2
అల్లం వెల్లుల్లి పేస్టు: 1tsp
గరం మసాల: 1/2tsp
ధనియాలపొడి : 1/2tsp
నూనె : 4tsp
పోపుకోసం :
మినపప్పు : 1tsp
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1tsp
పచ్చిమిరపకాయలు: 3
కారం;-1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. ముందుగా ఒక పాన్ తీసుకుని నూనెను వేసి కాగాక పోపు కోసం సిద్దం చేసుకొన్న దినుసులు, కరివేపాకు వేసి, వేగించాలి.
2. పోపు మీడియం మంట మీద వేగిన తర్వాత అల్లంవెల్లులి పేస్టు కుడా వేసి మరో రెండు మూడు నిముషాలు వేయించాలి.
3. తర్వాత ఉల్లిపాయముక్కలు, మునక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి 5-10నిముషాలు వేయించాలి.
4. తరువాత టమోటాముక్కలు, చిటికెడు పసుపు కారం వేసి మూత పెట్టాలి. 5 నిమిషాలు ఆగి గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి మరలా ముత పెట్టి కూరను ఉడికించాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు జత చేసుకోవచ్చు.
5. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే మునక్కాడ టమోటో కర్రీ రెడీ.



Click it and Unblock the Notifications