Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
డ్రై ఫ్రూట్స్ కేసరి-స్వీట్ డిష్
కేసరి ఒక స్వీట్ డిష్. కేసరిని వివిధ రకాల పదార్థాలతో వివిధ స్టైల్స్ తో తయారుచేస్తారు. రవ్వతో, బియ్యం, సేమియాలతో తయారుచేస్తారు. కేసరి ఎక్కువగా ఫెస్టివల్స్ సీజన్ లో ఎక్కువగా తయారుచేస్తుంటారు. స్వీట్ డిష్ లలో ఇది ఒక సులభమైన స్వీట్ డిష్.
డ్రైఫ్రూట్ ను ఉపయోగించి కేసరిని తయారుచేయడం వల్ల హెల్తీ మరియు టేస్టీ కూడా. ఈ హెల్తీ అండ్ టేస్టీ కేసరి రుచికి తగ్గట్లే, మంచి కలర్ మరియు మంచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మరి ఈ నోరూరించే డ్రై ఫ్రూట్ కేసరి ఎలా తయారుచేయాలో చూద్దాం...

బియ్యం: 1cup
డ్రై ఫ్రూట్స్: ½ cup (జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరం మరియు బాదం)
ఏలకుల పొడి: ½tsp
పంచదార: 4tbsp
నెయ్యి / వెన్న: 3tsp
కుంకుమ: 1 చిటికెడు(పసుపు లేదా ఎరుపు ఫుడ్ కలర్)
పాలు: 2tbsp
నీరు: 2cups
తయారుచేయు విధానం:
1. ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నింటిని రెండు మూడు నిముషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి.
2. తర్వాత బియ్యంను శుభ్రంగా కడిగి, పాన్ లో వేసి, కొద్దిగా నెయ్యి వేసి రెండు, మూడు నిముషాలు వేయించుకోవాలి. కలియబెడుతూ వేయించడం వల్ల బియ్యం బ్రౌన్ కలర్ కు మారకుండా ఉంటాయి.
3. ఇప్పుడు అందులో సరిపడా నీళ్ళు పోసి, మెత్తగా ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి. బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత గంజిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని అందులో పాలు, కుంకుమ పువ్వు వేసి 10నిముషాలు నాననివ్వాలి. అలాగే మీరు ఫుడ్ కలర్ కూడా ఉపయోగించాలనుకుంటే, దాన్ని కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా వేయించు పెట్టుకొన్న డ్రై ఫ్రూట్స్ మరియు అన్నం వేసి , బాగా మిక్స్ చేయాలి. అన్నంకు నెయ్యి బాగా పట్టే వరకూ మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టుకొన్న పాలను అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
6. అలాగే పంచదార కూడా వేసి బాగా బాగా మిక్స్ చేసి రెండు మూడు నిముషాలు ఉడికించుకోవాలి. పంచాదర పూర్తిగా కరిగిపోయే వరకూ ఉడికించుకోవాలి. స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొనే ముందు యాలకుల పొడి చల్లి క్రిందికి దింపుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్ కేసరి రెడీ...



Click it and Unblock the Notifications