Latest Updates
-
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
వెజిటేరియన్ స్పెషల్: గోబి బిర్యాని...

బాస్మతి బియ్యం: 2cups
నీరు: 3cups
ఒక ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
టొమాటో గుజ్జు: 1/2cup
పచ్చిబఠాణీ : 1/2cup
మీడియం సైజ్ క్యాలీఫ్లవర్: 1
బంగాళదుంప: 1 లేదా 2
జీడిపప్పు: 4-6
నెయ్యి లేదా నూనె: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర తరుగు: కొద్దిగా
మసాలాకోసం
జీలకర్ర: 1/2tsp
ధనియాల పొడి: 1tsp
ఏలకులపొడి: 1tsp
లవంగాలు: 2 లేదా 3
చెక్క చిన్న ముక్క
బిర్యాని ఆకు: 1
పసుపు: చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
బిరియానీ మసాలా లేదా గరం మసాలా: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి మూడు కప్పుల నీటిలో బాస్మతి బియ్యాన్ని ఉడికించాలి. ఉడుకుతుండగా కొద్దిగా ఉప్పు వేసి ఉడికిన అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేడిచేసి అందులో ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
3. తరవాత మసాలాదినుసులు కూడు ఒకదానికి తర్వాత ఒకటి వేసి, ఘుమ ఘుమలాడే వాసన వచ్చేవరకు వేయించాలి. వెంటనే టొమాటో గుజ్జు, పచ్చిబఠాణీ, బంగాళదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్ తరుగు(పువ్వులు పువ్వులుగా విడిపించి వేడినీళ్ళలో ఐదు నిమిషాలు వేసి తీసినవి) వేసి కలపాలి.
4. ఈ పదార్థాలన్నీ మెత్తబడేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీరు చిలకరించాలి. తరవాత ఉడికించుకున్న అన్నంలో ఈ పదార్థాలను కలపాలి. చివరగా జీడిపప్పు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే గోబి(క్యాలిఫ్లవర్)బిర్యాని రెడీ.



Click it and Unblock the Notifications











