Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హరియాలి(సొరకాయ కర్రీ) లౌకి కి సబ్జి రిసిపి
వేసవిలో వేడి, ఎండలకు చెమట ఎక్కువగా పట్టడంతో మన శరీరంలోని నీరంత పోయి శక్తిమొత్తం తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా సులభం జీర్ణం అవ్వడానికి మరియు శరీరాన్ని కూల్ గా ఉంచే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి.
వేసవిలో మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి బాటిల్ గార్డ్(సొరకాయ) ఒక ఉత్తమ ఆహారపదార్థం. ఈ వెజిటేబుల్లో ఎక్కువ నీరు ఉంటుంది మరియు చాలా సులభంగా, తేలికగా జీర్ణం అవుతుంది. ఈ అద్భుతమైన వెజిటేబుల్ రిసిపిని హరియాలి లౌకి కి సబ్జీ అంటారు. ఈ వంట గ్రీన్ కలర్ లో నోరూరిస్తుంటుంది. ఈ వంటను కొత్తిమీర మరియు పుదీనాతో తయారుచేస్తారు. వండర్ఫుల్ ఫ్లేవర్ తో పాటు గ్రేట్ టేస్ట్ ఉండే ఈ సొరకాయ కర్రీనీ ఎలా తయారుచేయాలో చూడండి..

కావల్సిన పదార్థాలు:
సొరకాయ(Gourd/lauki): 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తరుగు: 1కట్ట
పుదీనా: ½కొద్దిగా
పచ్చిమిర్చి: 2
ఉల్లిపాయ పేస్ట్: 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
టమోటో: 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5
ధనియాల పొడి: 1tbsp
ఛాట్ మసాలా పొడి సీసా: 1tsp
గరం మసాలా పొడి: ½tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా కొత్తిమీర మరియు పుదీనా శుభ్రంగా కడిగి, నీరు ఒడిగిపోయిన తర్వాత రఫ్ గా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. తరవ్ాత తర్వాత కొత్తిమీర మరియు పుదీనా, లవంగాలు, పచ్చిమిర్చి, టమోటోను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
4. ఇప్పుడు అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 5నిముసాలు వేగించుకోవాలి. 5నిముషాల తర్వాత సొరకాయ ముక్కలను వేసి మరో 10నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు
7. తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, ఛాట్ మసాలా, గరం మసాలా పౌడర్ వేసి 5నిముషాల పాటు వేగించుకోవాలి.
8. నీళ్ళు అవసరం అయిత చాలా తక్కువగా పోసుకోవాలి. ఎందుకంటే సొరకాయ ఉడికేటప్పుడు అందునుండి కొంచెం నీరు వస్తుంది.తర్వాత మూత పెట్టి 5-6నిములు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. సొరకాయ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆప్ చేసి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ హరియాలి లౌకికి సబ్జి వండించడానికి రెడి. ఈ రిసిపిని రైస్ మరియు రోటీలతో ఎంజాయ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications