Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
వేడి వేడి వెజ్ సమోసా-పచ్చిమిర్చి కారం భలే రుచి

కావలసిన పదార్థాలు:
మైదా: 1 cup
నెయ్యి: 1/2 cup
బేకింగ్ పౌడర్: 1/4 tbsp
ఉప్పు: రుచికి తగినంత
నీళ్ళు
సమోసా కూర తయారికి:
కావలసిన పదార్థాలు:
బంగాలదుంపలు: 2( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిమి పెట్టుకోవాలి).
క్యారెట్ 2, బీన్స్: 1/2cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాబేజ్ (సన్నగా తరిగినది): 1/2cup
ఉలిపాయాలు: 1 (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చి బఠానీలు: 1 cup
పచ్చిమిరపకాయలు: 2
కొత్తిమిరీ తరుగు: 2tbsp
నిమ్మరసం: 2tbsp
పసుపు: 1/2tsp
గరం మసాల: 1/2 tbsp
కారం: 1 tbsp
ఆవాలు: 2 tbsp
అల్లం వెల్లుల్లి పేస్టు: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
నునె: వేయించడానికి సరిపడా
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారు చేసే విధానం :
1. ముందుగా మైదాలో ఉప్పు, బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి చాలా మెత్తగా కలుపుకోవాలి. కలిపిన పిండిని అరగంట పాటు తడిబట్టలో చుట్టి వుంచాలి.
2. ఇంతలోపు సమోసాకు కూర సిద్దం చేసుకోవాలి. ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి. అందులో ఆవాలు, కరివేపాకు ,వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
3. పచ్చిమిర్చివేగిన తర్వాత ఇప్పుడు పచ్చిబఠానీలు, కూరగాయముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల, కొత్తిమిర, కారం, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకొని నీళ్ళు ఇమిరిపోయిన తర్వాత అందులో బంగాలదుంపను వేసి వేయించాలి.
4. తర్వాత అందులో నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న పెట్టుకున్న మైదాని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకునిచపాతీలా చేసి
వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి. అంచులు గట్టిగ వత్తుకోవాలి.
6. ఇలా అన్నింటిని తయారు చేసుకొన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో సమోసాను కాగే నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. అంతే వెజ్ సమోసా రెడీ. సమొసానీ టొమటో సాస్ తో కానీ లేదా పచ్చిమిర్చి చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications