Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
ఇడియప్పం -కేరళ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్
కేరళలో ముఖ్యంగా ఫిష్ డిషెష్ కు మాత్రమే ఫేమస్ అనుకుంటాం కానీ, ఫిఫ్ కాకుండా మరిన్ని పాపుర్ వంటకాలు కూడా ఉన్నాయి. వాటిలో ఇడియప్పం ఒకటి. దీన్నే నూలప్పం అని కూడ అంటారు . ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి కేరళాలో చాలా మంచి మరియు టేస్ట్ ఉన్నటువంటి రిసిపి.
ఈ హెల్తీ మరియు న్యూట్రీషియన్ ఇడియప్పం మరో రకంగా చెప్పాలంటే రైస్ నూడిల్స్, ను కోకనట్ మిల్క్ తో సర్వ్ చేస్తారు. ప్రస్తుత రోజుల్లో, ఈ ఫాస్ట్ జనరేషన్ లో, టెక్నాలజీ ఎంత అభివ్రుద్ది చెందుతున్నదో అంతే వేగంగా రెడీ మేడ్ వస్తువులు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఈ ఇడియప్పం పిండి కూడా మార్కెట్లో లోకల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంది. మరికెందుకు ఆలస్యం, పిండి తీసుకొచ్చే కేరళ రుచిని టేస్ట్ చేసేయండి...

కావల్సిన పదార్థాలు
ఇడియప్పం పిండి: 1cup
కొబ్బరి తురుము : 1cup
నీళ్ళు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె/నెయ్యి: ఇడ్లీప్లేట్ కు రాయడానికి
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక డిష్ లో నీళ్ళు పోసి కాగనివ్వాలి.
2. తర్వాత తర్వాత ఈ వేడి నీళ్ళను ఇడియప్పం పిండిలో పోయాలి. తర్వాత ఉప్పు కూడా వేసి మెత్తగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు, ఈ పిండిని ఇడ్లీ ప్లేట్ గుంతల్లో పోసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టాలి.
4. పిండిని ఇడ్లీ ప్లేట్ లో పోయడాని కంటే ముందు ఇడ్లీ ప్లేట్స్ కు నెయ్యి లేదా నూనెను రాయాలి.
5. తర్వాత ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్ లోనికి నూడిల్స్ లా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దాని మీద కొబ్బరి తురుమును చల్లుకోవాలి, ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ ను ప్రెజర్ కుక్కర్ లో పెట్టి, 5-10నిముషాలు ఉడికించుకోవాలి.
6. అంతే ఇది తయారైన వెంటనే కొబ్బరి పాలతో ఇడియప్పంను సర్వ్ చేయాలి. అంతే మీ ఇడియప్పం కేరళ డిష్ రెడీ. ఈ ఇడియప్పంను చల్లగా కూడా తినవచ్చు.



Click it and Unblock the Notifications