Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
జాక్ ఫ్రూట్ బిర్యానీ: వెజిటేరియన్ రైస్ రిసిపి
బిర్యానీ అంటే మనందరిక ఆల్ టైమ్ ఫేవరెట్ రిసిపి. చాలా మంది మాంసాహారప్రియులకు చికెన్ లేదా ఎగ్ లేదా మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టం. అయితే జాక్ ఫ్రూట్ బిర్యానీ అంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే ఎందుకంటే బిర్యానీ వెజిటేరియేన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా టేస్ట్ ఒకేలా ఉంటుంది. దాదాపు మసాలాలన్నీ కూడా ఒకే విధంగా ఉపయోగిస్తాము .
పచ్చిగా ఉండే జాక్ ఫ్రూట్ (పనసకాయ) ను వెజిటేరియన్ మాంసంగా రెఫర్ చేస్తారు. ఎందుకంటే దీని ఆకారం మాంసాహారం లాగా మరియు వాసన కూడా అలాగే కలిగి ఉంటుంది . పచ్చి పనసకాయతో కర్రీస్ మరియు చిప్స్ వంటివి తయారుచేస్తుంటాయి. మరి ఈ వెర్సిటైల్ వెజిటేబుల్ తో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది. చాలా టేస్టీగా. మరి మీరు కూడా రుచి చూడాలంటే, తయారుచేసే పద్దతి క్రింది విధంగా ఫాలో అయిపోండి..

కావల్సిన పదార్థాలు:
పండని పనస ముక్కలు: 6cups
బాస్మతి రైస్: 4 cups
లవంగాలు: 4
యాలకులు: 3
దాల్చిన చెక్క: 1
టమాటా
బే (బిర్యానీ)ఆకులు 3
ఉల్లిపాయలు: 2పెద్దవి(సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తరుగు: 2tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పుదీనా: 2tbsp (చిన్న ముక్కలుగా)
కుంకుమపువ్వు: కొద్దిగా
పాలు: ½cup(గోరువెచ్చగా చేయాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 1tbsp
నూనె: 4tbsp
నీళ్ళు: 12 cups
ఫార్మేషన్ కోసం:
పెరుగు: ½cup
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పసుపు: 1tsp
ధనియాల పొడి: 1tsp
పుదీనా పేస్ట్: 1tsp
కొత్తిమీర పేస్ట్: 1tsp
నిమ్మరసం: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
గోధుమ పిండి: కొద్దిగా
బిర్యానీ మసాల కోసం:
లవంగాలు: 5
దాల్చిన చెక్క: చిన్న ముక్క
యాలకలు: 3
షాజీర: 1/2tsp
బ్లాక్ పెప్పర్: 10
తయారుచేయు విధానం:
1. ముందుగా బిర్యానీ మసాలాకు సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత 6కప్పుల నీటిలో జాక్ ఫ్రూట్ ముక్కలు(పనసకాయ ముక్కలు)వేసి, 6కప్పుల నీళ్ళు పోసి, కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసి 15-20నిముషాలు ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించకూడదు
3. ఉడికిన తర్వాత నీరు వంపేసి, ఈ ఉడికించికొన్న జాక్ ఫ్రూట్ ముక్కలకు మ్యారినేషన్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటితో మ్యారినేట్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తర్వాత అందులో 6కప్పుల నీళ్ళు పోసి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 15నిముషాలు పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
5. ఒకసారి ఉడికిన తర్వత గంజి పూర్తిగా వంపేసి, అన్నంను పొడిపొడిగా ఉడికంచుకోవాలి. ఉడికిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ లో అన్నం తీసుకొని చల్లారనివ్వాలి.
6. అంతలోపు కుంకుమపువ్వును పాలలో వేసి పక్కన పెట్టుకోవాలి.
7. తర్వాత పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ననూనె వేసి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో 3టేబుల్ స్పూన్ల నూనె మరియు మ్యారినేట్ చేసిన జాక్ ఫ్రూట్ వేసి గిన్నె మొత్తం పర్దాలి.
9. ఇప్పుడు ఉడికించి చల్లార్చి పెట్టుకొన్న అన్నం కూడా లేయర్ గా పర్చాలి. దాని మీద నెయ్యిని చిలకరించాలి.
10. తర్వాత కొత్తిమీర మరియు పుదీనా తరుగును కూడా కొద్దిగా చిలకరించాలి.
11. తర్వాత కుంకుమ పువ్వు నానబెట్టుకొన్న పాలను కూడా రైస్ లేయర్ మీద స్పూన్ తో చిలకరించాలి. అలాగే దాని మీద బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ చిలకరించుకోవాలి.
12. తిరిగి మిగిలిన అన్నం మరో లేయర్ గా సర్ధాలి. దాని మీద ఫ్రైడ్ ఉల్లిపాయలు, తిరిగి బిర్యానీ మసాలా కుంకుమపువ్వుపాలు, బిర్యానీ మసాలా, లేయర్ గా పరవాలి.
13. ఇప్పుడు పాన్ కు మూత పెట్టి, ఆవిరి బయటపోకుండా చూట్టి గోధుమపిండితో ఆవిరి పోకుండా చుట్టిపెట్టుకోవాలి.
14. రెండు నిముషాలు ఎక్కువ మంట పెట్టి, తర్వాత మంట పూర్తిగా తగ్గించి 15-20నిముషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
15. ఒకసారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, మరో పది నిముషాలు మూత తియ్యకుండా అలాగే ఉంచాలి. పది నిముషాల తర్వాత మూత తీసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తర్వాత సర్వింగ్ బౌల్లోనికి మార్చుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే జాక్ ఫ్రూట్ బిర్యానీ రెడీ.



Click it and Unblock the Notifications











