Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కుల్చా-జీర పన్నీర్ బెస్ట్ కాంబినేషన్ రిసిపి
జీర పనీర్ చాలా సులభమైన మరియు అతి త్వరగా తయారుచేసే ఒక రుచికరమైన వంట. ఇది ఒక బెస్ట్ సింపుల్ రిసిపి దీన్ని, మధ్యాహ్నా భోజం లేదా డిన్నర్ కు ఫర్ఫెక్ట్ మ్యాచ్ .
ఈ జీర పన్నీర్ ఫ్రైని బట్టర్ కుల్చా లేదా పీస్ పులావ్ తో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ ఎంపిక చాలా అద్బుతంగా ఉంటుంది. మరి మీరు కూడా దీన్ని టేస్ట్ చూడాలంటే ట్రై చేయాల్సిందే...

కావల్సిన పదార్థాలు:
పనీర్: 250grm
జీలకర్ర: 1tbsp
ఎండుమిర్చి : 4
ఉద్దిపప్పు: 1tbsp
కారం: 1tsp
కరివేపాకు ఆకు కొన్ని
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగి)
ఆయిల్: 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా మీరు నూనెను ప్రెజర్ కుక్కర్ లో వేసి, మీడియం మంట మీద వేడి చేయాలి.
2. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర వేయాలి. వేడినూనెలో జీకలర్రను చిటపటలాడించాలి.
3. ఒక నిముషం తర్వాత అందులో ఉద్దిపప్పు, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి, ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వతా అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, బ్రౌన్ కరల్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో కారం వేసి మూడు నిముషాలు వేగించుకోవాలిజ.
6. తర్వాత అందులో పనీర్ ముక్కలను కూడా పాన్ లో వేసి నిధానంగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులో ఉప్పు మరియు నీళ్ళు వేసి మిక్స్ చేసి మూత పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి.
8. నీళ్ళు పూర్తిగా ఇమిరిపోయే వరుకూ ఉడికించుకోవాలి, పూర్తిగా మంటను తగ్గించి ఆవిరి మీద పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉడికించాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే జీరా పన్నీర్ ఫ్రై రెడీ. ఇది బటర్ కుల్చాకు బెస్ట్ కాంబినేషన్ .



Click it and Unblock the Notifications