Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కుస్ కుస్ ఆలూ-స్పెషల్ టేస్ట్
బంగాళదుంపలను వివిధ రకాలుగా వండుతారు, బంగాళదంపలు ఎలా వండినా చాలా రుచికరంగా ఉంటుంది. మరింత రుచికరంగా, టేస్టీగా తినాలంటే, కుస్ కుస్ ఆలూను ప్రయత్నించండి.
కుస్ కుస్ ఆలూ తయారుచేయడం చాలా సులభం, మరియు చాలా త్వరగా తయారుచేయవచ్చు. ఈ వంటను ప్రధానంగా కావల్సింది గసగసాలు, ఈ క్రీమి, టేస్ట్ ను ఈ గసగసాలు అంధిస్తుంది. మరి ఈ కుస్ కుస్ ఆలూను ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
పొటాటో: 5-6(పొట్టు తీసి, కట్ చేసి పెట్టుకోవాలి)
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 2-3
ఎండు మిర్చి: 3
పసుపు: చిటికెడు
కొత్తిమీర తరుగు: కొద్దిగా
కుస్ కుస్(గసగసాలు): 2tbsp(వేయించుకోవాలి)
నిమ్మరసం : 1tsp
తయారుచేయు విధానం:
1. ముందు వేయించి పెట్టుకొన్న గసగసాలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. తర్వాత ఎండు మర్చి, పసుపు వేసి వేయించి తర్వాత అందులో గ్రై చేసిపెట్టుకొన్న మసాలా ముద్ద వేసి ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో వేయించుకొన్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేయిస్తూ అందులో మసాలా బాగా పట్టే వరకూ వేయించుకోవాలి . బంగాళదుంపలను 10నిముషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి . అంతే టేస్టీ కుస్ కుస్ ఆలూ రెడీ .



Click it and Unblock the Notifications