హోం మేడ్ మసాలా ఓట్స్ : హెల్తీ బ్రేక్ ఫాస్ట్

రోజూ ఉదయం మనం తీసుకొనే అల్ఫాహారం, చాలా ముఖ్యమైనది. అందులోనే ఉదయం తీసుకొనే అల్పాహారం కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. అటువంటి ఆహారాల్లో ఓట్స్ తో తయారు చేసే ఆహారాలు బెస్ట్ అని చెప్పవచ్చు. బ్రేక్ ఫాస్ట్ రిసిపిలలో చాలా రకాలు ఉన్నాయి. అయితే రొటీన్ గా చేసేవాటికి కొంచెం బిన్నంగా తయారు చేసుకొంటే రుచిగా ఉంటుంది. అయితే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అంధిస్తే మరింత ఆనందం.

ఓట్స్ చాలా వరకూ పాలల్లో మిక్స్ చేసుకొని తింటారు. ప్లేయిన్ ఓట్స్ ను కొంచెం వెరైటీగా కొన్ని మసాలాలు దంటించి ఉప్మాలా తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా...పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ మసాలో ఓట్స్ లో వేసే క్యారెట్, క్యాప్సికమ్, టమోటో, బీన్స్, కొంచెం వెరైటీ టేస్ట్ ను అందిస్తాయి. మరి మసాలా ఓట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామా....

Masala homemade Oats For Breakfast

కావల్సిన పదార్థాలు:

ఓట్స్: 2 cups
ఉల్లిపాయలు: ½(సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఆవాలు seeds: ½ tsp
కరివేపాకు : 4
పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పసుపు: ఒక చిటికెడు
గరం మసాలా: 1tsp
క్యారెట్ : 100grm(చిన్న ముక్కలుగా తరిగినవి)
క్యాప్సికమ్: ½(చిన్నముక్కలుగా తరిగివి)
నూనె: 1tbsp
ఉప్పు రుచి సరిపడా
బీన్స్: 100grm(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కట్ చేసుకొన్న కూరగాయల (క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ )ముక్కలన్నీ వేసి, కొద్దిగా ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. ఆ తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరో 2-3నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. అలాగే, అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి
5. ఇప్పుడు టమోటో ముక్కలు, ఉప్పు, పసుపు, గరం మసాలా కూడా వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్న వెజిటేబుల్స్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
7. మొత్తం వెజిటేబుల్స్ ను 1-2నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
8. వెజిటేబుల్స్ ఉడికించిన నీటిని ఓట్స్ లో మిక్స్ చేసి కొద్దిసేపు ఉడకించి తర్వాత వేగుతున్న మసాలాలో పోయాలి .
9. ఇప్పుడు మొత్తం పదార్థాలన్నీ మిక్స్ చేస్తూ తక్కువ మంట మీద ఒక నిముషం ఉడికించుకోవాలి.
10. చివరగా మసాలా ఓట్స్ రిసిపికి సన్నగా తరిగిన కొత్తమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే హెల్తీ మసాలా ఓట్స్ రిసిపి రెడీ.

Story first published: Tuesday, November 25, 2014, 10:35 [IST]
Desktop Bottom Promotion