Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మైసూర్ మసాలా దోసె

కావలసిన పదార్థాలు:
మినపప్పు: 2cups
శెనగ పప్పు: 2cups
బియ్యం: 1cup
ఉప్పు: రుచికి తగినంత
ఎండు మిర్చి: 8-10
పసుపు: 1/4tsp
ఇంగువ: చిటికెడు
వెల్లుల్లి: 2
కారం: 1tsp
బంగాళ దుంపలు: 1/2kg
ఉడికించిన బఠాణీలు: 1/2cup
పచ్చి మిర్చి: 4-6
అల్లం: చిన్న ముక్క
ఆవాలు: 1/2tsp
మినపప్పు: 1tsp
శనగపప్పు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: తగినంత
కొబ్బరి చట్నీ: 1cup
టమోటో: 2
క్యాప్సికమ్: 2
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం, పప్పులు విడివిడిగా కనీసం ఆరుగంటలు నాన బెట్టి తరువాత మెత్తగా రుబ్బి తగినంత ఉప్పు ఎండు మిరపకాయలు కలిపి మళ్లీ రుబ్బుకోవాలి.
2. తర్వాత పిండిని బాగా కలియ బెట్టి గరిటజారుగా చేసుకుని 5-8 గంటలపాటు అలాగే ఉంచాలి.
3. అంతలోపు బంగాళదుంప బజ్జీ రెడీ చేసుకవాలి. అందుకు పాన్ లో నూనె వేడి చేసి పోపుదినుసులన్నీ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి చిటికెడు ఇంగువ వేసి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి.
4. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బఠాణీలు, పసుపు, అల్లం తురుము వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఉడికించి పొట్టు తీసి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను, కారం మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
5. తర్వాత వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసె పోసి దానికి పైన చట్నీ రాసి, టమోటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కులు దోసె మొత్తం పరవాలి. తర్వాతా దోసె మధ్యలో తగినంత బంగాళదుంప బజ్జీని పెట్టి కొద్దిగా దోరగా కాల్చి వేడి వేడి గా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి. అంతే మైసూర్ మసాలా దోసె రెడీ.



Click it and Unblock the Notifications