టేస్టీ అండ్ హెల్తీ పాలక్ కార్న్ కర్రీ

ప్రస్తుతం శీతాకాలం, ఈ చలికాలంలో మార్కెట్లో అనేక గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి. సంవత్సరం పొడవునా దొరకని కూరగాయలన్నీ ఈ సీజన్ లో ఎక్కువగా దొరుకుతాయి. మార్కెట్లో వివిధ రకాలుగా కలర్ ఫుల్ గా కనిపించే కూరగాలను ఎంపిక చేసుకోవడం కూడా కాస్త కష్టం గా ఉంటుంది.

వాటిలో ఆకుకూరాలు కూడా చాలా ఆరోగ్యకరం. అయితే సాధా ఆకుకూరలతో తయారుచేసే వంటలు తిని బోరుకొడుతుంటే, వాటినికి చక్కటి కాంబినేషన్ ఎంపిక చేసుకొని తయారుచేయవచ్చు. ఈ సీజన్ మరో అద్భుత ఆహారపదార్థం మొక్కజొన్న. ఆరోగ్యకరమైన గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కు మొక్కజొన్న కాంబినేషన్ లో తయారుచేసే వంట చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Palak Corn Curry Recipe
కావల్సిన పదార్థాలు:
బచ్చలికూర: 250grm
ఆయిల్: 5: 6tbsp
ఎండు మిర్చి 3: 4
జీలకర్ర: 1tsp
ఉల్లిపాయ: 1cup (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5-6(చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
అల్లం: 1 చిన్న ముక్క (తరిగినవి)
టమోటో : ½ cup (తరిగినవి)
ధనియాల పొడి: 3tsp
నిమ్మరసం : 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: ½tsp
గరం మసాలా పొడి ½ tsp
కార్న్ : 3cups

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకకూరను విడిపించి, మంచినీటిలో వేసి, కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక పెద్ద పాత్రలో నీళ్ళు పోసి, కాగనివ్వాలి.
3. తర్వాత 2చెంచాలా ఉప్పు మరియు ఆకుకూర వేసి 2 నిముషాలు ఉడికించాలి.
4. ఆకుకూర ఉడికిన తర్వాత నీరు వంపేసి, మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
5. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి .
6. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, రెడ్ చిల్లీ వేసి ఫ్రై చేయాలి.
7. తర్వాత అందులో గార్లిక్ వేసి, మరో కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి .
8. ఇప్పుడు అందులో టమోటో కూడా వేసి మరో నిముషం ఉడికించుకోవాలి.
9. తర్వాత అందులో ధనియాలపొడి, కారం, మరియు గరం మసాలా పౌడర్ వేసి వేగించుకోవాలి.
10. ఇప్పుడు అందులో ఒక కప్పు నీళ్ళు పోసి, 5నిముషాలు ఉడికించుకోవాలి.
11. ఇప్పుడు పాన్ ను స్టౌ మీద నుండి దింపి, పది నిముషాలు చల్లారనివ్వాలి.
12. చల్లానిరి తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
13. తర్వాత అదే పాన్ ను స్టౌ మీద పెట్టి వేడి చేసి, అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి, వేడిచేయాలి.
14. ఆ తర్వాత అందులోనే ఆకుకూర పేస్ట్ మరియు కప్పు నీళ్ళు కూడా వేసి 2,3 నిముషాలు ఉడికించుకోవాలి.
15. తర్వాత అందులోనే ముందుగా ఉడికించుకొన్న కార్న్ మరియు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరో 3,4 నిముషాలు ఉడికించుకోవాలి.
16. ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి, బాగా మిక్స్ చేసి, సర్వింగ్ బౌల్లోనికి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.
17. చివరగా ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి. ఈ రుచికరమైన పాలక్ కార్న్ కర్రీని పరోటా, పూరి, లేదా రైస్ తో సర్వ్ చేయండి.

Story first published: Friday, December 20, 2013, 12:05 [IST]
Desktop Bottom Promotion