పాలక్ ఫ్రైడ్ రైస్ వంటకం

Palak Fried Rice Recipe
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2cups
పాలక్ ప్యూరీ: 2cups(పాలకూరను ఉడికించి చల్లార్చి గ్రైండ్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(నిలువు ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యారెట్: 1(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చి బఠానీ గింజలు: 1cup
పచ్చి మిర్చి: 4-6(కట్ చేసుకోవాలి)
మిరియాల పొడి: 1/2tsp
సోయాసాస్: 1/2tbsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత

తయారు చేయు విధానం:
1. పాన్ లో నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు, క్యారట్, పచ్చిమిర్చి, బఠానీలు... ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగనివ్వాలి.
2. తర్వాత పాలక్ ప్యూరీ, ఉప్పు, మిరియాలపొడి, సోయాసాస్ వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి.
3. ఇప్పుడు బియ్యంకు రెండొంతుల నీళ్ళు అంటే రెండు కప్పుల బియ్యానికి, నాలుగు కప్పలు నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి.
4. తర్వాత బియ్యం పోసి ఉడకనివ్వాలి. అన్నం పూర్తయ్యాక దించి రైతాతో వేడి వేడిగా వడ్డించాలి అంతే..

Story first published: Saturday, February 11, 2012, 14:06 [IST]
Desktop Bottom Promotion