Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
పనీర్ టమోటో గ్రేవీ-స్పెషల్ సైడ్ డిస్
వెజిటేరియన్ డైట్ లో పన్నీర్ అధిక ప్రాధాన్యం ఇచ్చే ఒక డిష్. డైరీ ప్రొడక్ట్(పన్నీర్)చాలా అద్భుతంగా ఉంటుంది మరియు దీంతో స్నాక్స్ మరియు ప్రధానమైన రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. పనీర్ తో తయారు చేసే షీవర్స్ నుండి కర్రీస్ వరకూ లెక్కలేనన్ని వంటలు ఉన్నాయి. మరి మీకు కూడా పన్నీర్ వంటకాలంటే ఇష్టం అయితే. కొన్ని వంటలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకు ఒక అద్భుతమమైన టేస్ట్ కలిగిన పనీర్ టమోటో గ్రేవీ ఉంది.
పన్నీర్ వంటలు తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, చాలా కారంగా తయారు చేయాలని అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ, ఈ పనీర్ టమోటో గ్రేవీ, చాలా సులభంగా అతి తక్కువ సమయంలో టేస్టీగాత తయారు చేయవచ్చు. మరి ఈ వంటను ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

పనీర్: 250gms (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2
టమోటా 2
పసుపు: 1tsp
కారం: 1tsp
గరం మసాలా: ½tsp
పచ్చిమిరపకాయలు: 4
టమోటా సాస్: 1tsp
బిర్యానీ ఆకు: 1
జీలకర్ర: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో పన్నీర్ ముక్కలు వేసి మంట మీడియంగా పెట్టి 5-10నిముషాలు వేగించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీలో ఉల్లిపాయ, మరియు పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
3.తర్వాత అదే ఫ్రైయింగ్ పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
5. అంతలోపుటమోటోను గుజ్జుగా తయారు చేసుకోవాలి(మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి)
6. తర్వాత వేగుతున్న మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, పసుపు వేయడం వల్ల టమోటో త్వరగా ఉడుకుతుంది.
7. ఒకసారి గా ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ కు మారగానే, టమోటో గుజ్జును అందులో వేయాలి. అలాగే కారం, టమోటో సాస్, మరియు గరం మసాలా వేసి, బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
8. ఎక్కువ మంట పెట్టి 2-3నిముషాలు ఉడకనివ్వాలి. తర్వాత మంటను మీడియంగా పెట్టి, అందులో పన్నీర్ క్యూబ్స్ వేసి మరో ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. అంతే పన్నీర్ టమోటో గ్రేవీ రెడీ. చివరగా కొత్తిమీర ఆకులతో గార్నిస్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. రోటీ, రైస్, చపాతీలకు మంచి కాంబినేష్.



Click it and Unblock the Notifications