Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బంగాళదుంప సలాడ్ విత్ మస్టర్డ్ సాస్
సాధారణంగా బంగాళదుంతో వివిధ రకాల వంటలు వండుతారు. బంగాళదుపం కర్రీ, వేపుడు, చిప్స్ అంటే అందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా పిల్లలకు పెద్దలకు ఇష్టమైన బంగాళదుంపలతో టేస్టీగా వంటలను తయారుచేయవచ్చు. భారతీయ వంటకాలలో బంగాళదుంప ప్రముఖమైనది. తరచూ వాడబడుతుంది. ఇంట్లో రెండు బంగాళదుంపలు ఉన్నాయంటే చాలు కూరకోసం వెతుక్కోనక్కరలేదు అంటారు. దానిని ముక్కలు చేసి, ఉఢకబెట్టి ఏదో ఒక పొడికూర, వేపుడు చేసుకోవచ్చు.
బంగాళాదుంపలను తినడం వలన విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. అంతే కాకుండా పోటాషియం, కాపర్, ఐరన్‌లు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషక విలువలు ఉన్న బంగాళాదుంపను తీసుకోవడం వలన గుండెకు మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు. అటువంటి బంగాలదుంపతో తయారుచేసే సలాడ్ కూడా రుచిగా ఉంటుంది. ఈ ఆలూతో పాటు కొన్ని స్పైసీ పదార్థాలు, వెల్లుల్లి, గార్లిక్ వేయడం వల్ల మరింత టేస్ట్ గా ఉంటుంది.

కావల్సినపదార్థాలు:
చిన్న బంగాళదుంపలు: 2-3
ఆవాలు: 1tsp
మస్టర్డ్ సాస్: 1tsp(మార్కెట్లో దొరుకుతుంది)
ఉల్లికాడల తరుగు: 2tbsp
ఉల్లిపాయ: 1/2cup
కీరదోసకాయ ముక్కల తరుగు: 2tbsp
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి ముక్కలు: 2tsp
వెనిగర్: 1tsp
ఆలివ్ ఆయిల్ : 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
పెప్పర్ పౌడర్: రుచికి తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపల్ని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకుని చక్కల్లా తరగాలి.
2. తర్వాత వెడల్పాటి పాన్ లో ఆలివ్ నూనెను వేడిచేసి ఉల్లిపాయ, వెల్లుల్లి, ముక్కల్ని వేయించుకోవాలి.
3. తర్వాత అందులోనే ఆవాలు, మస్టర్డ్ సాస్, వెనిగర్, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా మిక్స్ చేసి స్టౌఫ్ ఆఫ్ చేయాలి.
4. ఇప్పుడు అందులోనే ముందుగా ఉడికించి చక్రాల్లా తరిగి పెట్టుకొన్న బంగాళాదుంప ముక్కలు, ఉల్లికాడల తరుగు, కీరదోస ముక్కలు వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో గంటసేపు ఉంచితే సరి..ఎంతో రుచికరంగా ఉండే పొటాటో సలాడ్ సిధ్దం..



Click it and Unblock the Notifications