Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
రెస్టారెంట్ స్టైల్: పనీర్ మఖానీ రిసిపి
పనీర్ మఖానీ రిసిపి. ఒక రుచికరమైన వంట. ఈ స్పెషల్ పనీర్ వంటను లంచ్ కు తీసుకోవచ్చు. ఇలాంటి రుచికరమైన పనీర్ డిష్ ను రెస్టారెంట్ స్టైల్లో మీరు తయారుచేసుకోవాలంటే తయారుచేసే పద్ధతిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ పనీర్ మఖానీ రిసిపి ఇండియన్ మసాలా దినుసులతో మరియు మరికొన్న పదార్థాలను తయారుచేసుకోవచ్చు.
ఈ రుచికరమైన పన్నీర్ మఖాని రిసిపి ఒక సర్వింగ్ లో 200క్యాలరీలు కలిగి ఉన్నాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే, ఈ విషయాన్నిగమనించుకోవాలి . మరి ఈ రుచికరమైన పనీర్ మఖానీ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Serves: 3
Preparation Time: 20 minutes
Cooking Time: 22 minutes

కావల్సిన పదార్థాలు:
పనీర్: 250gms(కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ : 2 (ఉల్లిపాయ పేస్ట్)
బట్టర్: 2tbsp
అల్లం & వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
కారం: 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా

ధనియాల పొడి: 1 tsp
జీలకర్ర పొడి : 1 tsp
గరం పౌడర్ : ½ tsp
పసుపు : ½tsp
టొమాటోస్ : 1cup(పేస్ట్)
మెంతులు: 1 tsp(ఆకులు)
తాజా క్రీమ్: 1 tsp
నీరు: ½tsp
జీడిపప్పు : ½cup(పేస్ట్ చేసుకోవాలి)
కొత్తిమీర: గార్నిష్ కోసం

తయారుచేయు విధానం:
1. ఒక డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా బటర్ వేసి కరగనివ్వాలి. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసి కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
2. మీడియం మంట మీద ఫ్రై అవుతున్నప్పుడు, అందులో కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, గరం మసాలా మిరయు పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు ఫ్రై చేయాలి. మసాలా పాన్ కు అంటుకోకుండా, మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి.
4. ఒకటి రెండు నిముషాలు మొత్తం మిశ్రమం ఉడకనివ్వాలి.
5. ఇప్పుడు అందులోనే టమోటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి తర్వాత మూత పెట్టాలి. 5-10నిముషాలు ఉడికిన తర్వాత తిరిగా కలగలుపుకోవాలి.
6. ఇప్పుడు అందులో మెంతులు మరియు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి, బాగా మిక్స్ చేసి తర్వాత పెరుగు వేసి మిక్స్ చేయాలి.
7. తర్వాత మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా ఫుట్ కలర్ ను రోజడించాలి. ఇంకా మసాలా చిక్కగా అనిపిస్తే, కొద్దిగా నీరు కూడా మిక్స్ చేసుకోవాలి .
8. గ్రేవీ మొత్తం చిక్కగా ఉడికే సమయంలో అందులో పన్నీర్ ముక్కలు వేసి, నిధానంగా మిక్స్ చేయాలి.
9. పన్నీర్ ఉడికిన తర్వాత గ్రేవీ మీద కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేసి, ఈ రుచికరమైన వెజిటేరియన్ రిసిపిని వైట్ రైస్ తో సర్వ్ చేయాలి.

న్యూట్రీషియన్ టిప్: పనీర్ లేదా కాటేజ్ చీజ్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లలకు మరియు పెద్దలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఇది పిల్లలు మరియు పెద్దల్లో ఎముకలను బలోపేతం చేయడానికి మరియు దంతాలు స్ట్రాంగ్ గా మార్చడానికి సహాయపడుతుంది.




Click it and Unblock the Notifications