Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రైస్ ఖీర్-టేస్టీ ట్రెడిషనల్ స్వీట్ రిసిపి
రైస్ ఖీర్ ఒక క్లాసిక్ డిజర్ట్. ఇది మన ఇండియన్ కుషన్స్ లో చాలా సాంప్రదాయకరమైన ఆహారం. ఈ వంటను తయారుచేయడం చాలా సులభం, మరియు చాలా తక్కువ సమయం పడుతుంది. ఈ ట్రెడిషినల్ స్వీట్ రిసిపిని పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ ఇష్టపడుతారు. ముఖ్యంగా ఇది పిల్లలకు శక్తినించే ఒక పోషకహారం.
బియ్యంతోనే కాకుండా, లేఫ్ట్ ఓవర్ రైస్ (రాత్రి మిగిలిన అన్నం లేదా మద్యాహ్నా మిగిన అన్నం)తో తయారుచేస్తారు . మిగిలిన అన్నం పారేయుండా ఉపయోగించుకోవడానికి ఇది ఒక చక్కటి ఉపాయం. ఈ రైస్ ఖీర్ మన ఇండియాలలో ఒక ట్రెడిషనల్ మరియు పాపులర్ అయినటువంటి స్వీట్ డిష్. దీన్ని పాలు మరియు అన్నం లేదా బియ్యంతో తయారుచేస్తారు . పంచదార, కుంకుమపువ్వుతో ఈ రిసిపికు ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది. దీన్ని మధ్యాహ్నాన లచ్ బాక్స్ కూడా హ్యాపీగా తినవచ్చు.

బాస్మతిరైస్: 1cup
పంచదార: 1/2 cup
కుంకుమపువ్వు: కొద్దిగా
పాలు: 8cups
నెయ్యి: 1tbsp
నీళ్లు: 1cup
కిస్‌మిస్(ఎండు ద్రాక్ష): 1tsp
ఏలకుల పొడి: 1tsp
జీడిపప్పు + బాదంపప్పు: 1/2cup
తయారుచేయు విధానం:
1. ముందుగా గిన్నెలో పాలు పోసి మరిగించాలి. మంట తగ్గించి, బియ్యం కడిగి మరుగుతున్న పాలలో పోసి ఉడికించాలి.
2. తర్వాత బియ్యం సగం ఉడికిన తర్వాత, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి.
3. కీర్ కు సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేసిన తర్వాత అందులో పంచదార, జీడిపప్పు వేసి మరికాసేపు ఉడికించాలి.
4. బియ్యం బాగా మెత్తగా ఉడికుతూ, పంచదారకరిగిపోయి అన్నంతో బాగా కలిసిపోయిన తర్వాత , కుంకుమపువ్వు, ఏలకులపొడి, కిస్‌మిస్ వేసి బాగా కలపాలి.
5. తర్వాత క్రిందికి దించి, చల్లారిన తర్వాత, కావలసినంత ఒక డబ్బాలో పోసి, టిఫిన్ బాక్స్‌తో పాటు బ్యాగ్‌లో పెట్టాలి. ఈ ఖీర్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు. పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
గమనిక: ఇక్కడ బియ్యంతోనే కాకుండా రాత్రి మిగిలిన అన్నంతో కూడా తయారుచేసుకోవచ్చు. ఇక్కడ బియ్యం ఉడికించడానికి బదులు నీరు బాగా మరిగిన తర్వాత అందులో రాత్రి మిగిలిన అన్నం వేసి ఉడికించి, మిగిలిన పద్దతిని అలాగే అనుసరించాలి.



Click it and Unblock the Notifications