Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
స్పైసీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ విత్ చిల్లీ పనీర్ డ్రై
చిల్లీ పనీర్ డ్రై చాలా సులభంగా మరియు సింపుల్ గా తయారు చేసేటటువంటి పనీర్ వంటకం. ఈ స్పైసీ డిష్ ఇండియన్ రెస్టారెంట్స్ లో చాలా పాపులర్ అయినటువంటి స్టార్టర్. ఈ రిసిలో పన్నీర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఈ రిసిపికి కొన్ని మసాలా దినుసులతో పాటు క్యాప్సికమ్ మరియు పచ్చిమిర్చిలు అల్లం వెల్లుల్లి మరింత టేస్ట్ ను అందిస్తాయి.
మరి ఈ స్పైసీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ చిల్లీ పనీర్ డ్రై ను ఎలా తయారు చేయాలో చూదాం...

కావలసిన పదార్ధాలు:
కాప్సికమ్: 200grm
పనీర్: 250grm
ఉల్లిపాయ తరుగు: 1cup
పచ్చి మిర్చి : 4
టొమాటోలు: 2(పెద్దవి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
ఉల్లిపాయ పేస్ట్ : 2tbsp
టొమాటో ప్యూరీ : 2tbsp
సోయా సాస్ : 2tbsp
చిల్లీ సాస్ : 1tsp
మిరియాల పొడి: 1/2tsp
నీళ్ళు : 1/2cup
నూనె : 2 cups
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేసే విధానం:
1. ముందుగా కాప్సికమ్‌ను, ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. పనీర్‌ను పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. పచ్చి మిరపకాయలను మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి కాప్సికమ్, పనీర్, ఉల్లిపాయ ముక్క లు, టొమాటోలు ఒక దాని తర్వాత చిటికెడు ఉప్పు వేస్తూ వేసి వేయించి ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి.
3. నూనెను తిరిగి వేడి చేసి, దానిలోనే ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి.
4. తర్వాత టొమాటో ప్యూరీ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులో కారం, మిరియాల పొడి వేసి ఒక అర నిమిషం వేగనివ్వా లి.
5. అందులోనే చిల్లీ సాస్, సోయా సాస్ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్, పనీ ర్, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి ఐదు నుంచి నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. చిల్లీ పనీర్ రెడీ.



Click it and Unblock the Notifications