Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
స్పైసీ టమోటో-పుదీనా పులావ్
టమోటో పుదీనా పులావ్ నోరూరించే ఒక రుచికరమైన వంట. తినడానికి రుచికరంగా ఉండే ఈ టమోటో పులావ్ పుదీనా ఫ్లేవర్ తో టెంప్ట్ చేస్తుంటుంది. ఈ టేస్టీ అండ్ స్పైసీ టమోటో పులావ్ రిసిపిని తయారుచేయడానికి టమోటోలో మరియు, తాజా పుదీనా ఆకులను ఉపయోగించి అద్భుతంగా తయారుచేయవచ్చు.
ఈ స్పైసీ టమోటో పులావ్ రిసిపిని తయారుచేయడం చాలా సులభం, చాలా త్వరగా కూడా తయారుచేయవచ్చు. ఈ పులావ్ రిసిపిని ఎలా తయారుచేయాలో క్రింది విధంగా చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 500grm
టమోటోలు: 250grm
పుదీనా: 1కట్ట(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
నెయ్యి, షాజీరా: ఒక్కొక్క చెంచా
యాలకులు: 5
లవంగాలు : 8
దాల్చిన చెక్క: చిన్నది
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. టమోటోలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత మంద పాటి గిన్నెలో నూనె వేసి, వేడయ్యాక, అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా వేసి, 5నిముషాల పాటు, మీడియం మంట మీద వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వేయాలి. .
4. ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర్ గ్లాసు చొప్పున నీళ్లను తీసుకోవాలి.
5. ఇప్పుడు ఈ నీళ్ళలలో టమోటో పేస్ట్ ను వేసి, బాగా మిక్స్ చేసి, వేగుతున్న మిశ్రమంలో పోయాలి.
6. నీళ్ళు మరుగుతుండగా అందులో బియ్యం, ఉప్పు వేసి, మూతపెట్టాలి. అన్నం తయారయ్యాక అందులో నెయ్యి వేసి, మరో రెండు నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత దింపేసుకోవాలి. అంతే స్పైసీ టమోటో పులావ్ రెడీ...



Click it and Unblock the Notifications