Latest Updates
-
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే!
స్టఫ్డ్ పనీర్ సాండ్విచ్: ఈజీ&సింపుల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి
ప్రస్తుత కాలంలో చాలా సింపుల్ మరియు ఈజీ రిసిపిలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంటారు. అటువంటి వాటిలో పనీర్ సాండ్విచ్ రిసిపి ఒకటి. ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు కడుపు నిండుగా ఉంచుతుంది. డైటర్స్ కు ఇది ఒక గొప్ప బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్. మీరు ప్లెయిన్ టోస్ట్ బ్రెడ్ స్రాంబుల్డ్ ఎగ్ లేదా బ్రెడ్ స్లైస్ మద్య ఏదైన స్టఫ్ చేసితీసుకోవచ్చు.
టోస్ట్ సాండ్విచ్ కొరకు వెజిటేరియన్స్ వివిధ రకాల పదార్థాలను స్టఫింగ్ గా ఉపయోగించచ్చు. ఆలూ బ్రెడ్ సాండ్విచ్ నుండి పనీర్ టోస్ట్ వరకూ చాలా రకాలు మీరు ట్రై చేయవచ్చు . మీరు పనీర్ ఫ్యాన్స్ అయితే , ఇక్కడ మీకోసం చాలా సులభంగా..త్వరగా తయరయ్యే పనీర్ సాండ్విచ్ తయారుచేసే విధానాన్ని ఇస్తున్నాము . ఈ విధానాన్ని అనుసరించి పనీర్ సాండ్విచ్ ఎలా తయారుచేయాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు హెల్తీ సాండ్విచ్ ను బ్రేక్ ఫాస్ట్ గా అందివ్వండి....

కావల్సిన పదార్థాలు:
పనీర్: 100gms
బ్రెడ్ స్లైస్: 8-10
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కాప్సికమ్ ½ (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పసుపు: 1tsp
కారం: 1tsp
టమోటో సాస్: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tsp
వెన్న : టోస్టింగ్ కోసం
తయారుచేయు విధానం :
1. ముందుగా ప్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులో క్యాప్సికమ్ మరియు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి, మీడియం మంట మీద 3,4నిముషాలు వేగించి తర్వాత పసుపు మరియు ఉప్పు కూడా వేయాలి.
3. అంతలోపు, పనీర్ తీసుకొని చేత్తో పొడిపొడిగా చేసుకొని, పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత అందులో కారం, టమోటో సాస్ కూడా జోడించి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో పొడిచేసుకొన్న పనీర్ కూడా అందుల వేసి బాగా మిక్స్ చేయాలి. అలాచేయడం వల్ల ఫ్రై అవుతున్న మిగిలిన పదార్థాలన్ని పనీర్ లో కలిసిపోతుంది. 3,4నిముషావేలు మీడియం మంట మీద వేగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
5. తర్వాత టోస్టర్ ను వేడి చేయాలి.
6. బ్రెడ్ స్లైస్ మీ ఫ్రై చేసుకున్న పనీర్ ను స్టఫింగ్ లా పేర్చాలి . స్టపింగ్ గా పనీర్ మిశ్రమం పెట్టిన తర్వాత దానికి మీద మరో బ్రెడ్ స్లైస్ ఉంచి, తర్వాత బటర్ ను రాయాలి.
7. ఇప్పుడు ఈ స్టఫ్డ్ బ్రెడ్ ను టోస్టర్ లో పెట్టి టోస్ట్ చేయాలి. అంతే, తినడానికి పనీర్ స్టఫ్డ్ సాండ్విచ్ రెడీ. వీటిని టమోటో సాస్ త సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











