Latest Updates
-
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా..
స్వీట్ కార్న్ సేమియా ఉప్మా..
కావలసిన పదార్థాలు
సేమియా: 1cup
స్వీట్ కార్న్ మొక్కజొన్న: 1cup
క్యారెట్: 1(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పొటాటో: 1(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
నీళ్ళు: 1cup
పచ్చిమిర్చి: 4-6
ఉప్పు: రుచికి తగినంత
నిమ్మరసం: 1tbsp
పోపుకోసం
నూనె: 2tbsp
ఎండుమిర్చి: 2
ఆవాలు : 1tsp
శెనగపప్పు, ఉద్దిపప్పు: 1tsp
జీలకర్ర: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేడి చేసి అందులో సేమియా వేసి లైట్ గా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ మరొకొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఎండు మిర్చి, ఆవాలు, వేసి వేగిన తర్వాత పోపుదినుసులను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, క్యారెట్, పొటాటో ముక్కలు స్వీట్ కార్న్ వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి.
4. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, వేసి ఒక కప్పు నీళ్ళు చేర్చి బాగా కాగనివ్వాలి.
5. నీరు మరుగేటప్పుడు వేయించి పెట్టుకొన్న సేమియా వేసి బాగా మిక్స్ చేయాలి. పూర్తిగా మంట తగ్గించి మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. క్రిందికి దింపుకొనే ముందు కొంచెం కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే స్వీట్ కార్న్ సేమియా ఉప్మా రెడీ..



Click it and Unblock the Notifications