Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గుమ్మడికాయ గ్రేవీ రిసిపి
గుమ్మడికాయ వంటల గురించి ఈతరం పిల్లలకు పెద్దగా తెలీదు. కారణం గుమ్మడి వంటలు తయారుచేయడం బాగా తగ్గిపోవడమే. ముద్ద పప్పు, గుమ్మడికాయ పులుసులాంటి సాంప్రదాయ కాంబినేషన్ కూడా ఇప్పుడు ఏ కిచెన్‌లోనూ కనిపించడం లేదు. పప్పు, పులుసు అవుట్‌డేటెడ్. కొత్తదేమైనా ఉంటే చెప్పండంటున్నారు ఈ తరం ఆహారప్రియులు.
గుమ్మడితో ఏరకమైన వంట వండినా చాలా టేస్ట్ గా ఉంటుంది. అంతే కాదు, ఆరోగ్యం విలువలు కూడా ఎక్కువే. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిల్లు ఉంటుందా?ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి. గుమ్మడితో చేసిన వంటకాలు తినండి...కడుపులో కూడా దిష్టి పోయి హాయిగా ఉంటుంది. ఇంటికీ, ఒంటికీ మంచి చేసే గుమ్మడి ఎప్పుడు వండుకుంటే అప్పుడే పండగ! గుమ్మడికాయ లాంటి మీ ‘ఫ్యామిలీ' కోసం ఈ రోజు ఘుమ్మడి ట్రీట్ స్వీట్ పంప్కిన్ గ్రేవీతో ఎంజాయ్ చేయండి!!

కావల్సిన పదార్థాలు:
గుమ్మడికాయ: 1/4(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తాజా కొబ్బరి : కొద్దిగా(తురిమినది)
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పసుపు: 1/2tsp
బెల్లం: చిన్న ముక్కలుగా చేసుకోవాలి
ఉప్పు: రుచికి సరిపడా
పోపుకోసం:
నూనె: 1tbsp
ఆవాలు: 1tsp
ఉద్దిపప్పు: 1tsp
కరివేపాకు: కొద్దిగా
తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో గుమ్మడికాయ ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు, మరియు పసుపు కూడా సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కుర్కర్ మూత తీసి, గుమ్మడికాయను మెత్తగా మ్యాష్ చేయాలి . ఎక్కువగా మెత్తగా చేయకుండీ మీడియంగా రఫ్ చేయాలి.
3. ఇప్పుడు అదే కుక్కర్ లోనే కొబ్బరి తురుము మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
4. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఉద్దిపప్పు, కరివేపాకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
5. పోపు వేగిన తర్వాత కుక్కర్ లో మిక్స్ చేసి పెట్టుకొన్ని గుమ్మడి, కొబ్బరి మిశ్రమాన్ని పోపులో పోసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని, ఉడికించుకోవాలి. అంతే స్వీట్ పంప్కిన్ (గుమ్మడికాయ) గ్రేవీ రిసిపి రెడీ...



Click it and Unblock the Notifications